తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ జూనియర్ పాఠశాల మరియు కళాశాలలోముస్లిం మైనార్టీ బాల బాలికల సీట్లను 2023- 24 విద్యా సంవత్సరానికి పూర్తిస్థాయిలో భర్తీ చేయటానికి మహబూబాబాద్ పట్టణంలోని మైనార్టీ పాఠశాల యందు నేడు అడ్మిషన్ అవగాహన కార్యక్రమాన్ని జిల్లా మైనార్టీస్ సంక్షేమ అధికారి అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమములో వివిధ మస్జిద్ ఇమాములు, మౌజానులి, మఫ్టిలు, వివిధ కమిటీ సభ్యులు, వక్స్ బోర్డ్ సభ్యులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి హాజరైన సభ్యులు మాట్లాడుతూ టీమ్రీస్ సంస్థ కల్పిస్తున్నా వివిధ సౌకర్యాల పట్ల సంతృప్తిని వ్యక్తం చేసినారు. ముఖ్యంగా అరబిక్ క్లాసులు, ఉర్దూ క్లాసులు నిర్వహించడం పట్ల సెక్రటరీ గారికి కృతజ్ఞతలు తెలియజేసినారు. ఈ విద్యా సంవస్రములో సీట్ల భర్తీకి తమ వంతు సహాయ సహకారాలు , తోడ్పాటు అందజేస్తా మని తెలిపినారు. ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి జి శ్రీనివాస్ రావు గారు, RLC శ్రిపాల గారు, విజిలెన్స్ అధికారులు మక్బల్ పాషా గారు, అమ్జాద్ అలి గారు, అకాడమిక్ కో ఆర్డినేటర్ రుహీన గారు, ప్రిన్సిపాల్ డాక్టర్ జి. శ్రీనివాస్, వనజ, రాజ సుధ, పుష్పలత, ఇమాముద్దిన్ పాల్గొన్నారు.