గళం న్యూస్ వరంగల్ వరంగల్ జిల్లాలో పుష్ప సినిమాను తలదన్నేలా గంజాయి స్మగ్లింగ్ చేస్తున్న ముఠాను వరంగల్ జిల్లా పోలీసులు పక్కా సమాచారంతో గంజాయి , రవాణా చేస్తున్న ట్రాక్టర్ మరియు ట్రాక్టర్ ట్రాలీని పట్టుకున్నారు, ట్రాక్టర్ ట్రాలీ పరిశీలించిన పోలీసులు స్మగ్లర్ల తెలివికి అవాక్కయ్యారు, ఒడిశాలో గంజాయి కొనుగొలుచేసి వరంగల్ గుండా హైదరాబాద్ తరలించే యత్నం చేసిన స్మగ్లర్లు ఎవరికి తెలియకుండా ట్రాక్టర్ ట్రాలీ కింద గంజాయి రవాణాకు ప్రత్యేకమైన అరలు ఏర్పాటు చేసుకొని దర్జాగా ఒడిస్సా నుంచి ఈ నెల 17న బయలుదేరి వరంగల్ జిల్లా హసన్పర్తి మండలంలోని అనంతసాగర్ వద్ద హసన్పర్తి పోలీసుల వాహన తనిఖీలు భాగంగా పోలీసులకు ట్రాక్టర్ తో సహా దొరికిపోయారు. స్మగ్లర్లకు షాక్ ఇచ్చిన వరంగల్ యాంటి డ్రగ్స్, హసన్పర్తి పోలీసులు ₹85 లక్షల విలువ చేసే 338 కిలోల గంజాయి స్వాధీనం చేసుకొని ట్రాక్టర్ డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.పరారీలో గంజాయి స్మగ్లర్లు,స్మగ్లర్ల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టినట్టు వరంగల్ పోలీసులు తెలిపారు.