వరద భాదితులకు దాతల సహకారం మరువలేనిది.
Suryapetమెట్టు వీరనారాయణ ప్రెండ్స్ సర్కిల్ వారిచే దుప్పట్లు,బెడ్ షీట్ల పంపిణీ.
దుప్పట్లు,బెడ్ షీట్ల పంపిణీ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శెట్టి సురేష్ నాయుడు.
కోదాడ,గళం న్యూస్: మండల పరిదిలోని కూచిపూడి గ్రామంలో ఇటీవల కురిసిన వర్షాల కారణంగా వచ్చిన వరదల వల్ల ఇళ్ళు నీటమునిగిపోయి నిత్యావసర వస్తువులు కూడా కొట్టుకుపోయిన విషయం తెలుసుకున్న మెట్టు వీర నారాయణ తన మిత్రుల సహాయంతో 250 కుటుంబాలకు దుప్పట్లు,బెడ్ షీట్లను వారి తల్లిదండ్రులు పుల్లయ్య – రాజ్యం మరియు మాజీ సర్పంచ్ శెట్టి సురేష్ నాయుడు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్బంగా ముఖ్య అతిధిగా పాల్గొన్న మాజీ సర్పంచ్ శెట్టి సురేష్ నాయుడు మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన కూచిపూడి గ్రామాన్ని ఆదుకోవడానికి దాతలు ముందుకు రావాలని నిత్యావసర వస్తువులు లేక తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలు లేక అలమటిస్తున్నారని వారి భాదలను తెలుసుకున్న మెట్టు వీర నారాయణ తన మిత్రుల సహకారంతో 250 కుటుంబాలకు కప్పుకోవడానికి బెడ్ షీట్లు,దుప్పట్లను పంపిణీ చేయడం అభినందనీయమని వారిని ఆదర్శంగా తీసుకుని దాతలు ముందుకు రావాలని వరద బాధితులకు ఆపన్న హస్తం అందించాలని అన్నారు.* ఈ కార్యక్రమంలో చిన్నపంగు సుధాకర్,మెట్టు పుల్లయ్య రాజ్యం ప్రసాద్ త్రివేణి, నాగేంద్ర బాబు,రాజశేఖర్,రమేష్, సుందర్ రావు తదితరులు పాల్గొన్నారు.