E69 న్యూస్ భూపాలపల్లి : మొగుళ్ళపల్లి మండల కేంద్రంలో నిత్యవసర సరుకులు మరియు కూరగాయలు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసిన వారాంతపు సంతను భూపాలపల్లి శాసనసభ్యులు శ్రీ గండ వెంకటరమణారెడ్డి గారు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల యొక్క అవసరం కోసం మండల కేంద్రంలో ప్రతి శుక్రవారం సంత నిర్వహించడం చాలా సంతోషకరమని, మండలంలో దాదాపు అన్ని గ్రామాలలో సంతం ఏర్పాటు చేసుకొని కావలసిన నిత్యవసర సరుకులు అందుబాటులో తెచ్చుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నానని తెలిపారు.గతంలో కూరగాయలు కావాలంటే పట్టణాలకు వచ్చి కూరగాయలు తీసుకునే పరిస్థితి నుంచి నేడు పట్టణాల నుంచి పల్లెలకు తీసుకురావడం ఒకరకంగా బాధాకరమైన విషయమని, గ్రామాలలో రైతులు కూరగాయల సాగును ప్రోత్సహిస్తూ స్థానికంగా వ్యాపార అభివృద్ధి చెందాలని కోరుకున్నారు..అన్ని రకాల వసతులతో కూడిన సరుకులకు ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని ఆశాభావం వ్యక్తం చేసి,సంతను ప్రారంభించడం శుభసూచకమని గుర్తు చేశారు. అనంతరం మొగుళ్లపల్లి మండల కేంద్ర వాస్తవ్యులు కోడారి ఓదెలు వినోద గారి కుమార్తె అక్షయ వెడ్స్ రాజ్ కుమార్ ల వివాహ వేడుకలో పాల్గొని వారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గారి వెంట స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.