విద్యార్థులు అందరూ 10/10 సాధించాలి ఇదే తొలి మెట్టు
Mahabubabadసీఐ ఎన్ సాగర్,ఎస్సై పవన్ కుమార్
ఈ69న్యూస్ డోర్నకల్:-
మానుకోట జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని మోడల్ స్కూల్, మరిపెడ ప్రభుత్వ పాఠశాలలో నన్నే సాబ్ సేవా ట్రస్ట్ ఖలీల్, ఖాదీర్,రహిమాన్ వారి ఆధ్వర్యంలో పదవ తరగతి విద్యార్థులకు పరీక్షలకు అవసరమైన ఫ్యాడ్,పెన్నుల పంపిణీ కార్యక్రమంలో మరిపెడ సీఐ ఎన్ సాగర్,ఎస్సై పవన్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఐ సాగర్ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు విద్యార్థులకు తొలిమెట్టు ఇక్కడి నుండి, జీవిత లక్ష్యాన్ని నిర్ణయించుకొని,శ్రమించి చదివితే విజయం సాధించవచ్చు అని అన్నారు.మారుతున్న కాలాన్నిఅనుగుణంగా పోటీ ప్రపంచంలో నిలదొక్కువాలంటే శ్రమ తప్పనిసరి అన్నారు. పదవ తరగతి పరీక్షలతో విద్యార్థుల జీవితాలు,లక్ష్యాలు ముడిపడి ఉంటాయి కాబట్టి, శ్రద్ధతో చదివి మంచి మార్కులు పొందాలన్నారు. తల్లిదండ్రులకు,చదువుతున్న పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలన్నారు.పదవ తరగతి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం విద్యార్థులకు ఫ్యాడ్,పెన్నులు అందజేశారు.
మరిపెడ ఎస్సై పవన్ కుమార్ మాట్లాడుతూ శ్రమించి చదివితే,విజయం దానంతట అదే వస్తుందని,శ్రమ అనేది తప్పనిసరి కాబట్టి అందరూ కష్టపడి ఇష్టంగా చదవాలన్నారు.బయట పోటీ ప్రపంచాన్ని తట్టుకోవాలంటే నాణ్యమైన విద్య అవసరం అన్నారు.నన్నే సాబ్ సేవా ట్రస్ట్ వారు పదవ తరగతి విద్యార్థులు 10/10 జిపి సాధిస్తే ఐదు వేల రూపాయలు ప్రతి విద్యార్థికి ప్రోత్సాహక బహుమతిగా అందజేస్తామని ప్రకటించారు.ఈ కార్యక్రమంలో మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ ప్రేమ్ కుమార్,చైర్మన్ గండి విష్ణు,ఉపాధ్యాయుల బృందం, మరిపెడ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు, జనార్ధన్ చారి, విద్యార్థులు ఇంకా తదితరులు పాల్గొన్నారు.