ఆదిలాబాద్ జిల్లా,డిసెంబర్ 7 :- బాధిత కానిస్టేబుల్ కుటుంబానికి జిల్లా పోలీసు యంత్రాంగం ఎల్లవేళలా సహాయపడుతుంది. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ. బుధవారం జగిత్యాల జిల్లా ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా నుండి ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్ సంబంధించిన కానిస్టేబుల్ చవాన్ పరశురాం జగిత్యాలకు వెళ్లడం జరిగింది. బందోబస్తులో భాగంగా మంగళవారం సాయంత్రం హఠాత్తుగా గుండెపోటుతో చవాన్ పరుశురాం మరణించారు. ఈ విషయాన్ని తెలుసుకున్న జిల్లా ఎస్పీ డి ఉదయ్ కుమార్ రెడ్డి ఈరోజు ఉదయం చవాన్ పరుశురాం స్వగ్రామం ఉట్నూర్ మండలం వడోని గ్రామానికి వెళ్లి బాధిత కానిస్టేబుల్ అంతక్రియలు పాల్గొని కుటుంబానికి సంతాపం తెలియజేశారు. విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన చవాన్ పరశురాం కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. బాధిత కుటుంబానికి అంతక్రియల నిమిత్తం రూ 20,000/- అందజేసి, కుటుంబానికి ప్రభుత్వపరంగా వచ్చే అన్ని ప్రయోజనాలను అందజేసే విధంగా కృషి చేస్తానని తెలిపారు. ఎటువంటి సహాయానికైనా జిల్లా పోలీసు వ్యవస్థ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని కుటుంబానికి ధైర్యం కల్పించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఎస్ శ్రీనివాసరావు, ఉట్నూర్ ఎ ఎస్పి హర్షవర్ధన్, జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు పెంచాల వెంకటేశ్వర్లు ఉట్నూర్ సిఐ ఐ సైదారావు, ఎస్సై డి సునీల్, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.