కష్టాల్లో ఉన్న వారి కన్నీరు తుడవడమే రాఘవరెడ్డి శవాన్ని భుజంపై ఎత్తిన తాసిల్దార్ జల దిగ్బంధంలో ఉన్న పాపను సురక్షితంగా తరలిస్తున్న రాఘవ మణుగూరు: కష్టాల్లో ఉన్న వారి కన్నీళ్లు తుడవడం సాటివారి బాధకు కన్నీటి బొట్లు రాల్చడం ఎవరికైనా చేతనైనా పని! కానీ ఆ కన్నీటి వెనుక కారణం తెలుసుకొని ఆ బాధను రూపుమాపడానికి ప్రయత్నించే వారిలో కొందరికి మాత్రమే సాధ్యమవుతుంది…! ఆయనే మన తహసిల్దార్ రాఘవరెడ్డి.. మణుగూరు సుందరయ్య నగర్ లో సంభవించిన వరదల నేపథ్యంలో కదలలేని పరిస్థితిలో ఒక వికలాంగుడు మృతి చెందుతే తనకు ఎవరూ లేకపోవడంతో అన్ని తానై మృతదేహాన్ని భుజాల మీద వేసుకొని అంబులెన్స్ వెక్కించి పోస్టుమార్టం చేపించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్ప చెప్పాడు మణుగూరు తాసిల్దార్ రాఘవరెడ్డి. రాఘవరెడ్డి పట్ల అధికారులు స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు