శాయంపేట మండలంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేసిన వరంగల్ జెడ్పిఛైర్పర్సన్ గండ్ర జ్యోతి

శాయంపేట మండలం వసంతపూర్, గంగిరేణిగూడెం, కొప్పుల,జోగంపల్లి, మైలారం, పెద్దకోడేపాక గ్రామాలలో వరంగల్ జడ్పీ ఛైర్పర్సన్ భారత రాష్ట్ర సమితి భూపాలపల్లి జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి గండ్ర జ్యోతి,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టత్మకంగా ఆడపడుచులకు బతుకమ్మ పండుగ కానుకగా అందిస్తున్న బతుకమ్మ చీరలను మహిళ సోదరిమనులకు పంపిణిచేసారు…ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు అంగరంగ వైభవంగా నిర్వహించుకునే అతి పెద్ద పండగ బతుకమ్మ దసరా కానుకగాను గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఆడపడుచుకు చీరను అందించడం జరుగుతుంది.అంతరం విద్యార్థులు క్రీడాల్లో రానించాలని క్రీడా కిట్లను క్రీడాకారులకు అందించారు.ఈ కార్యక్రమంలో మండల ప్రజా ప్రతినిధులు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *