శ్రీ చైతన్య పాఠశాల నందు ఘనంగా తెలుగు భాష మరియు జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలు
Anantapur, Andhra Pradeshతెలుగుగళం న్యూస్,పామిడి, రిపోర్టర్ – మల్లికార్జున.
గుంతకల్ నియోజకవర్గం పామిడి పట్టణం శ్రీ చైతన్య పాఠశాల నందు తెలుగు భాష మరియు జాతీయ క్రీడా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు.అనంతరం తెలుగు వ్యవహారిక భాష పితామహుడు గిడుగు రామ్మూర్తి పంతులుకి, హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్‌చంద్ చిత్రపటాలకు పాఠశాల సీఈవో, డైరెక్టర్ సంతోష్ రెడ్డి మరియు రమణారెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పాఠశాల సీఈఓ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ గ్రాంథిక భాషగా వున్న తెలుగును సరళం చేసి, వ్యవహారిక తెలుగు భాషలో గల అందాన్ని, ఆనందాన్ని, రమ్యతను తెలుగు జాతికి తెలియపరచిన “అక్షర చిచ్చర పిడుగు గిడుగు పంతులు”ని స్మరిస్తూ ప్రతి సంవత్సరం ఆగస్టు 29 తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటామని విద్యార్థులకు తెలియజేశారు.డైరెక్టర్ రమణారెడ్డి మాట్లాడుతూ మన మాతృభాష తెలుగని, తెలుగు భాష మాధుర్యం,గొప్పదనం గురించి అనునిత్యం స్పురణ కలిగి, ప్రపంచ భాషా స్రవంతి లో మన తెలుగు భాష జీవనదిలా గల కళ కళలతో అన్ని భాషల్లో అగ్రగామిగా నిలిచేలా చేయాల్సిన బాధ్యత మనందరిది అని విద్యార్థులకు తెలియజేశారు. అలాగే ప్రతి విద్యార్థి కూడా ధ్యాన్‌చంద్‌ని స్ఫూర్తిగా తీసుకొని చదువుతోపాటు క్రీడల్లో కూడా రాణించాలని, ప్రతిరోజు క్రమం తప్పకుండ ధ్యానం మరియు వ్యాయామం చేయాలనీ విద్యార్థులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించినటువంటి నృత్యాలు,నాటకాలు మరియు కవితలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని, విద్యార్థులు పాల్గొన్నారు.