సంక్షేమ పథకాల అమలుపై సమీక్ష సమావేశం
దమ్మపేట మండలంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండలంలోని అన్ని శాఖల అధికారులతో కలిసి ప్రస్తుతం జరుగుతున్నటువంటి అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల పురోగతి మరియు అవి ఎప్పటిలోగా పూర్తి చేస్తారు అనే అంశాలను ఆయా శాఖల అధికారులు సిబ్బందిని అడిగి తెలుసుకున్న అశ్వరావుపేట నియోజకవర్గ శాసనసభ్యులు జారే ఆదినారాయణ
పాఠశాలల అభివృద్ధి మరియు విద్యా వసతుల ఆయిల్ ఫామ్ తోటల వలన విద్యుత్ అంతరాయం తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ధరణి పోర్టల్ లో ప్రస్తుత భూ సమస్యల పరిష్కారం
గ్రామ పంచాయతీల అభివృద్ధి మరియు పారిశుధ్య పరిశుభ్రత
సిసి రోడ్స్ మరియు బిటి రోడ్స్ పలు వంతెనలు బ్రిడ్జిల నిర్మాణ పనుల పురోగతి
పోడు భూములు సమస్యలు పరిష్కారం
వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులు ప్రభావం లేకుండా ఆరోగ్య శాఖ ద్వారా ప్రజలను చైతన్య పరుస్తూ మెరుగైన వైద్యం మరియు వసతులు కల్పన
ఇవే కాకుండా మరికొన్ని సమస్యల పైన సమీక్ష నిర్వహించి మండలంలోని అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని తెలియజేశారు