సంక్షేమ హాస్టల్లో తీరు అధ్వానం

సంక్షేమ హాస్టల్లో తీరు మారకుంటే ఆందోళన ఉదృతం చేస్తాం -పాలడుగు నాగార్జున జిల్లా ప్రధాన కార్యదర్శి

సంక్షేమ హాస్టల్స్ నిర్వహణ లోపభూయిష్టంగా ఉందని నల్లగొండ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ బీసీ సంక్షేమ హాస్టల్లో సమస్యలు వర్ణనాతీతమని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున అన్నారు సంక్షేమ హాస్టల్లో తీరు మారకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈరోజు నల్లగొండ ఎస్టి సంక్షేమ హాస్టల్లో సమగ్ర సర్వే నిర్వహించి విద్యార్థులతో మాట్లాడటం జరిగిందని తెలిపారు. ప్రతిరోజు భోజనమే తప్ప టిఫిన్ తెలియదని నీళ్ల చారు ఒకే రకమైన కూరగాయల కాలం వెళ్లదీస్తుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని వర్షపు నీరు నిల్వ ఉండి రోగాలు వచ్చే ప్రమాదం ఉందని అన్నారు కండ్ల కలకలు వస్తున్నాయని వెంటనే విద్యార్థులకు మెడికల్ చెక్ అప్ చేయించి సరియైన మందులు అందించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ పట్టణ కార్యదర్శి గాదె నరసింహ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *