జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ మహబూబాబాద్ జిల్లా గళం న్యూస్:- సదరం ధ్రువీకరణ పత్రాలకు అర్హులైన వారు ఈ నెల 5వ తేదీ ఉదయం 11 గంటల నుండి స్లాట్ బుక్ చేసుకోవాలని జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు.స్లాట్ బుక్ చేసుకున్న దివ్యాంగులకు వైకల్య పరీక్షలను ఏప్రిల్ 10,24 తేదీలలోనిర్వహించడం జరుగుతుంద న్నారు. ఈ నెల10వ తేదీన రెన్యువల్స్ కు, అదేవిధంగా కొత్తగా సదరం సర్టిఫికెట్ పొందడానికి 24వ తేదీన స్లాట్ బుక్ చేసుకోవాలన్నారు. సదరం క్యాంపు లో రెన్యువల్ కోసం 150, కొత్తగా సదరం సర్టిఫికెట్ పొందుటకు 150 మొత్తంగా 300 స్లాట్లు అందుబాటులో ఉంటాయన్నారు.కొత్తగా సదరం సర్టిఫికెట్ పొందవలసినవారు ముందుగా సమీపంలోని ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలలో డాక్టర్లచే వైకల్య నిర్ధారణ పరీక్ష చేయించు కోవాలన్నారు. స్లాట్ బుకింగ్ కొరకు మీసేవ లో చార్జి క్రింద 35 రూపాయలు చెల్లించవలసి ఉంటుందన్నారు.