కోదాడ మునిసిపాలిటీ పరిదిలోని 25 వ వార్డ్ కౌన్సిలర్ చింతల మణి గారు డిసెంబర్ నెలలో జరిగిన రోడ్డు ప్రమాదం లో తలకు బలమైన గాయం తగిలి గత 50 రోజులుగా హాస్పిటల్ లో ఉండి, గత రాత్రి తుది శ్వాస విడిచారు. గత రెండు సంవత్సరాలుగా పాలక వర్గం లో ఉండి సేవలు అందించి అందరి మన్ననలు పొందిన మణిగారికి పాలక వర్గ సభ్యులు అందరు కలిసి ప్రత్యేక నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్ పర్సన్ వనపర్తి శిరీష లక్ష్మీనారాయణ గారు, పట్టణ అధ్యక్షులు చందు నాగేశ్వర్ రావు, మాజీ ఛైర్పర్సన్ వంటిపులి అనిత నాగరాజు, కౌన్సిలర్లు తీపిరిశెట్టి సుశీల రాజు, దారావత్ ఖైలాస్వామినాయక్, పెండెం వెంకటేశ్వర్లు, మహమ్మద్ ఫాతిమా ఖాజా, కట్టబోయినజ్యోతి శ్రీను, షైక్ మదార్ సాహెబ్, గుండెల సూర్యనారాయణ ,వంటిపులి రమ శ్రీను, కో ఆప్షన్ సభ్యులు సాధిక్, TRSV అధ్యక్షులు బొర్రా వంశీ (నాని), యూత్ వింగ్ ఉపాధ్యక్షులు తమలపాకుల లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.