సిపిఎం పార్టీ జూబ్లీహిల్స్ జోన్ కమిటీ ఆధ్వర్యంలో జనచైతన్య యాత్ర ముగింపు సభను జయప్రదం చేయాలని గోడ పత్రిక ఆవిష్కరించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం…. రాజ్యాంగాన్ని కాపాడుకుందాం …..లౌకిక తత్వాన్ని పెంపొందించుకుందామని ఈనెల 17 నుంచి 29 వరకు తెలంగాణ రాష్ట్రంలో సిపిఎం పార్టీ రాష్ట్ర నాయకులు మూడు జాతాలు జన చైతన్య యాత్ర గా ప్రజలను చైతన్యం చేస్తూ యాత్రలు నడుస్తా ఉన్నాయి ముగింపు సందర్భంగా ఈనెల 29 రోజున ఇందిరా పార్క్ వద్ద సభ ఉంటుంది. ఈ సభకు ముఖ్య అతిథి కేంద్ర పోలిట్ బ్యూరో సభ్యులు ప్రకాష్ కారాత్ గారు హాజరవుతున్నారు. కావున అందరూ హాజరై జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ జోన్ కన్వీనర్ రాపర్తి అశోక్ ,టి సాయి శేషగిరిరావు, జే స్వామి, టీ భాగ్యరాజ్, బాలయ్య ,సికిందర్, సత్యనారాయణ ,నాగేష్ తదితరులు పాల్గొన్నారు