సీఎం పర్యటనను విజయవంతం చేయాలి

ఈ నెల 20వ తేదీన సూర్యాపేట జిల్లాలో తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు పర్యటనను విజయవంతం చేయాలని మండల పరిషత్ అధ్యక్షురాలు యాతాకుల జ్యోతి మధుబాబు అన్నారు. గురువారం మండల కేంద్రంలో పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ కార్యాలయం, పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల సందర్భంగా శాసనసభ్యులు బొల్లం మల్లయ్య ఆదేశానుసారం మండలం నుండి పార్టీ శ్రేణులు అత్యధిక సంఖ్యలో హాజరు కావాలని కోరారు.ఈ కార్యక్రమంలో మండల సమన్వయ కమిటీ సభ్యులు దేవబత్తిని సురేష్ ప్రసాద్, గార్లపాటి శ్రీనివాస్ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శి బడేటి చంద్రయ్య,అనంతుల ఆంజనేయులు,పిఎసిఎస్ చైర్మన్ లు పుట్టా రమేష్, గోసుల రాజేష్,వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు గ్రామ శాఖ అధ్యక్షులు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *