సువెన్ సేవలు అభినందనీయం.
Suryapetమండల విద్యాధికారి శేష గాని శ్రీనివాస్ గౌడ్
సూర్యాపేట రూరల్: పాఠశాల విద్యార్థులకు నోట్ బుక్స్, టై, బెల్టు, షూ లు సువేన్ ఫార్మసిటికల్ వారు అందించడం అభినందనీయం అని సూర్యాపేట మండల విద్యాధికారి శేష గాని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మంగళవారం సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డు రాయినిగూడెం లోని మల్లు వెంకట నరసింహారెడ్డి మెమోరియల్ పాఠశాలలో విద్యాభ్యాసం చేస్తున్న 65 మంది విద్యార్థిని విద్యార్థులకు నోట్ బుక్స్, షూ, టై, బెల్ట్ లు సువెన్ ఫార్మసిటికల్ వారి సహకారంతో అక్షర పౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మూడవ వర్ధంతి సందర్భంగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మల్లు వెంకట నరసింహారెడ్డి మెమోరియల్ పాఠశాల అభివృద్ధికి దాతలు ముందుకు రావడం సంతోషదాయకo అన్నారు. ఇంగ్లీష్ మీడియం ద్వారా విద్యను అందించడం జరుగుతుందన్నారు. గ్రామ ప్రజల సహకారంతో విద్యార్థుల సంఖ్యను పెంచుకొని విద్యార్థులందరికీ నాణ్యమైన విద్యను అందించేందుకు కోసం ప్రభుత్వ ఉపాధ్యాయ బృందం తీవ్ర కృషి చేస్తుందన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిరగాని యాకయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాయినిగూడెం మాజీ సర్పంచ్ సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి, సువెన్ ఫార్మసిటికల్ బాధ్యులు రమేష్, పిఎస్ఎన్ఆర్ మూర్తి, బగ్గ వెంకటరమణ, దుస్స సైదులు, విద్యా కమిటీ చైర్మన్ ఎల్గూరి వినోద, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు,గ్రామస్తులు మేకన బోయిన శేఖర్, వెలగబోయిన మధు యాదవ్, గుర్రం వెంకటరెడ్డి, మందడి రామ్ రెడ్డి, మేకన బోయిన సైదమ్మ,కామల్ల లింగయ్య, నల్ల మేకల అంజయ్య, నారాయణ వీరారెడ్డి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.