భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బండి సంజయ్ కుమార్ గారి ఆదేశాల మేరకు ,TSPSC లో అక్రమాలకు బలైన నిరుద్యోగులకు భరోసాగా భారతీయ జనతా పార్టీ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ఆధ్వర్యంలో, అసెంబ్లీ కన్వీనర్ ఐలోని అంజిరెడ్డి గారి అధ్యక్షతన ఈ రోజున నియోజకవర్గం కేంద్రంలో బస్టాండ్ సమీపం లోని అంబేద్కర్ విగ్రహం వద్ద బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ మంత్రి గుండె విజయ రామారావు, వరంగల్ పార్లమెంట్ కో కన్వీనర్ ఇనుగాల యుగంధర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర నాయకులు బొక్క ప్రభాకర్, అసెంబ్లీ కో కన్వీనర్ గురజాల వీరన్న గార్లు తో కలసి స్వర్గీయ మాజీ ఎమ్మెల్యే శ్రీ బొజ్జపల్లి రాజయ్య గారి తనయుడు బిజెపి రాష్ట్ర నాయకులు బొజ్జపల్లి సుభాష్ గారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నిరసన ధర్నా చేపట్టారు*. ఈ కార్యక్రమంలో బిజెపి అసెంబ్లీ పరిధిలోని రాష్ట్ర, నాయకులు, వివిధ మోర్చల జిల్లా అధ్యక్షులకు,అసెంబ్లీ కోర్ కమిటీ, మండల అధ్యక్షులకు, ఇంచార్జ్ లు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.