జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ ప్రభుత్వ ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాష షేక్ ఆకస్మిక తనిఖీ చేశారు.ఆస్పత్రి పరిసరాలతో పాటు వైద్య సిబ్బంది రిజిస్టర్ ను పరిశీలన చేసి అందుబాటులో లేని వైద్యులపై అసహనం వ్యక్తం చేశారు.అందుబాటులో లేని ఆరుగురు వైద్యులకు రిజిస్టర్ లో ఆప్సెంట్ వేశారు.కలెక్టర్ తో పాటు స్టేషన్ ఘనపూర్ ఆర్డీవో వెంకన్న,డిప్యూటీ డిఎం అండ్ హెచ్ ఓ సుధీర్ పాల్గొన్నారు.