స్థానిక ఐకెపి సెంటర్ ను పరిశీలించిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి స్టేషన్గన్పూర్ ఇన్చార్జి శ్రీమతి ఇందిర
Jangaon
ఈరోజు (24-05-2023)స్థానిక ఘన్పూర్ లోని ఐకెపి సెంటర్ పరిశీలించి స్థానిక రైతులు మాట్లాడుతూ గత 20 రోజుల నుండి సెంట సెంటర్లోకి లారీలు రావడం లేదు జోకిన వడ్లకు రాసీదులు ఇవ్వడం లేదని మరియు తరుగు విషయంలో మిల్లర్లు అవలంబిస్తున్నటువంటి ధోరణి సమంజసం కాదని వివరించడం జరిగినది
వారి యొక్క ఆవేదన ఉదయం నుండి సాయంత్రం సాయంకాలం వరకు ఇక్కడ వేచి చూచే ధోరణి అవలంబించడం తప్ప రైతులకు న్యాయం జరగడం లేదని అందువల్లనే నేను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నానని ఐకెపి సెంటర్ లోని ఒక రైతు యొక్క ఆవేదన తెలియజేయడం జరిగింది
స్టేషన్ ఘనపూర్ ఇంచార్జీ శ్రీమతి ఇందిరగారు మాట్లాడుతూ
కేసీఆర్ తడిసిన వడ్లను కూడా కొంటామని చెప్పడం జరిగినది కానీ అది ఆచరణలో లేదు తక్షణమే యుద్ధ ప్రాతిపదిగా అన్ని సెంటర్లలో వడ్ల కొనుగోలును పూర్తి చేయాలని మరియు తడిసిన ధాన్యానికి 10,000 నష్టపరిహారం కూడా రైతులకు ఐకెపి సెంటర్ దగ్గరనే అందజేయాలని ఆనాడు కాంగ్రెస్ హయాంలో కల్లాలలోనే వడ్ల కొనుగోలు జరిగినదని ఇలాంటి అవకవతవకలు జరగలేదని రైతులకు భరోసా ఇవ్వడం జరిగినది
ఈ కార్యక్రమంలో స్టేషన్గన్పూర్ మండలం అధ్యక్షులు జూలకంటి శిరీష్ రెడ్డి గారు జిల్లా ప్రధాన కార్యదర్శి చింత ఏ లయ్య గారు , కిసాన్ సెల్ మండల అధ్యక్షుడు సింగపురం వెంకటయ్య గారు, రాష్ట్ర యూత్ ప్రధాన కార్యదర్శి కీసర దిలీప్ రెడ్డి గారు మండల ప్రధాన కార్యదర్శి సింగపురం నాగయ్య గారు మండల యూత్ అధ్యక్షులు శ్రీనివాస్ గారు మండల మహిళా అధ్యక్షురాలు జోత్స్న గారు మండల ఉపాధ్యక్షురాలు ప్రశాంతి గారు సోషల్ మీడియా నియోజకవర్గ ఇన్చార్జ్ రడపాక రాజ్ కుమార్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్ వసంత్ గారు మహేందర్ గౌడ్ స్థానిక నాయకులు రామచందర్ గారు గారు రైతులు తదితరులు పాల్గొన్నారు