స్థానిక పంచాయతీ అధికారులకు, కనువిప్పు కలగాలి
Bhadradri Kothagudemఇటీవలే కాలంలో కురుస్తున్న వర్షాలకు గ్రామాలలో డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ లాంటి జ్వరాలు వస్తున్నాయి. ఇటువంటి క్రమంలో గ్రామాలలో బ్లీచింగ్ దోమల మందు పిచికారి చేయాలి. ఎప్పుడో ఒకసారి చేసి చేతులు దులుపేసుకున్నారు అని గ్రామస్తులు వాపోతున్నారు. అసలు పంచాయతీ కి వచ్చినటువంటి నిధులు ఏమైనవి. ఎటు పోతున్నాయి పంచాయతీని ఎవరు నడిపిస్తున్నారు ఎవరి చేతిలో ఉంది పంచాయతీ అధికారి ఎవరు ఎక్కడ ఉంటారు ఎవరికి తెలియని పరిస్థితి ఏదైనా సమస్య వస్తే ఎవరితో చెప్పుకోవాలి గ్రామస్తుల ఆవేదన చెందుతున్నారు. ఇప్పటివరకు స్పెషల్ ఆఫీసర్ కానీ కార్యదర్శి కానీ మా గ్రామానికి వచ్చిన దాఖలు లేవు. ఈ వర్షాలకు దోమలు విష పురుగులు ప్రవేశిస్తున్నాయి. మండలం లో ఉన్న పుట్టతోగు గ్రామంలో విష పురుగులు, దొమ్మలు రాకుండా ఉండటం కోసం రోడ్డుకిరువైపులా స్థానిక గ్రామస్తులు కలుపు ముందు స్ప్రే చేశారు. మండల స్పెషల్ ఆఫీసర్ స్థానిక కార్యదర్శి సంప్రదించాలన్న పంచాయతీ ఆఫీసులలో ఉండరు, ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాని పరిస్థితి. మండలంలో ఉన్న ఎంపీఓకి చెప్పిన ఉపయోగం లేదు చూస్తాను చేస్తాను అనేసి అంటారు. ఇప్పటికైనా ఉన్నత స్థాయి అధికారులు చొరవ తీసుకొని మా ఏజెన్సీ గ్రామాలపై దృష్టి పెట్టీ బ్లీచింగ్, దోమల మందు పిచ్చి కారి చెప్పించాలి అని స్థానిక గ్రామ పంచాయతీ అధికారులు పట్టించుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.