హన్మకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా 74 వ గణతంత్ర వేడుకలు.
Hanamkonda74 వ గణతంత్ర వేడుకలను హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా హన్మకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ నాయిని రాజేందర్ రెడ్డి గారు జాతీయ పతాకాన్నిఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.
ఈ సందర్భగా నాయిని రాజేందర్ రెడ్డి గారు మాట్లాడుతు..
భారత దేశ రాజ్యాంగం 1950 లో ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది.
ఈ రోజు జాతీయ గర్వించదగిన రోజు. భారతదేశంలోని అన్ని కులాలు మరియు వర్గాల ప్రజలను ఐక్యంగా ఉంచే మన రాజ్యాంగంలోని విభిన్న విలువలను కూడా ఇది గుర్తు చేస్తుంది.
భారత రాజ్యాంగం ప్రపంచంలోనే అతిపెద్ద లిఖిత రాజ్యాంగం.
స్వాతంత్ర భారతావని మొట్టమొదటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ 1950 జనవరి 26న 21 ఫిరంగుల సెల్యూట్ స్వీకరించడంతోపాటూ, భారత జాతీయ జెండాను ఎగురవేసి దేశాన్ని సంపూర్ణ గణతంత్ర దేశంగా ప్రకటించారు.
భారత రాజ్యాంగానికి 2 సంవత్సరాల, 11 నెలల, 18 రోజుల కాలము పట్టింది.
ప్రపంచములోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగముగా గుర్తించబడిందని అన్నారు.
డాక్టర్ బి.ఆర్ అంబెడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేసి నేటికీ 74 సంవత్సరాలు అయిందని అన్నారు.
ఆ రోజు నుండి నేటి వరకు రిపబ్లిక్ డే ను పండగ వాతావరణంగా జరుపుకుంటున్నాం.
నేటి యువత ప్రజలు దేశ సేవతో పటు దేశ భక్తిని కలిగి ఉండాలని, భారత రాజ్యాంగం అందించిన హక్కులను, బాధ్యతలను ప్రతి ఒక్కరు పాటించాలి.
కాంగ్రెస్ పార్టీ భారత స్వాతంత్య్రం కోసం ఎంతో కృషి చేసిందని జవహర్లాల్ నెహ్రు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ కుటుంబాలు దేశం కోసం అహర్నిశలు శ్రమించేవారని వారి బాటలో మనం నడిచి దేశాభివృద్ధికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పాటుపడాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ, మాజీ ఎం.పి. సిరిసిల్ల రాజయ్య, వర్ధన్నపేట నియోజకవర్గ కో-ఆర్డినేటర్ నమిండ్ల శ్రీనివాస్, కార్పొరేటర్ తోట వెంకటేశ్వర్లు, AIPC జిల్లా అద్యక్షుడు డాక్టర్ పులి అనిల్ కుమార్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు బంక సరళ, జిల్లా, జిల్లా ఎస్.సి డిపార్టుమెంటు చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ, గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ మైనారిటీ సెల్ చైర్మన్ మిర్జా అజీజుల్లా బేగ్, INTUC జిల్లా అద్యక్షుడు కూర వెంకట్, జిల్లా ఒబిసి డిపార్టుమెంటు చైర్మన్ బొమ్మతి విక్రం, యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు అలువాల కార్తిక్, జిల్లా NSUI అద్యక్షుడు పల్లకొండ సతీష్, మాజీ కార్పొరేటర్ నసీం జహాన్, టిపిసిసి అనుబంధ సంఘాల కార్యదర్శులు, కన్వినర్లు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, జిల్లా మరియు నగర కాంగ్రెస్ నాయకులు, బ్లాక్/ డివిజన్ కాంగ్రెస్ అద్యక్షులు, జిల్లా యూత్ కాంగ్రెస్/ మహిళా కాంగ్రెస్/ఒబిసి/ఎస్.సి./మైనారిటీ డిపార్టుమెంటు/ NSUI నాయకులు తదితరులు పాల్గొన్నారు.