హన్మకొండ విశాల్ భవన్ లో ఈ రోజు ఏర్పాటు చేసిన పత్రికా విలేఖరుల సమావేశంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి

ముందుగా నేను మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవనందుకు క్షమించండి, డిసెంబర్ 1 నుండి మీ అందరినీ కలుస్తాను
ఒక స్వతంత్ర అభ్యర్థి తన ప్లాట్‌ను ప్రస్తుత ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ బృందం ఆక్రమించడాన్ని చూసి చాలా బాధపడ్డాను
బీఆర్‌ఎస్‌తో బీజేపీ చేతులు కలపడం చాలా బాధాకరం
నియోజకవర్గ అభివృద్ధికి మాత్రమే కృషి చేస్తానని, భూకబ్జాలు ఉండవని, గూండాయిజం ఉండదని హామీ ఇస్తున్నాను
డిసెంబర్ 3 నుంచి నియోజకవర్గ ప్రజలందరు ప్రశాంతంగా నిద్రించవచ్చని హామీ ఇస్తున్నాను.
కే.సి.ఆర్ ఏ మొఖం పెట్టుకొని వరంగల్ కు వచ్చాడు.
గత 10 సంవత్సరాల నుండి అమలు చేయని హామీలు ఇప్పుడు ఏం చేస్తాడు.
కేవలం ఎన్నికల దృష్టిలో పెట్టుకొని అమలుకు నోచుకోని హామీలు
ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి ఎన్నికలు అయిపోగానే ముఖం చాటేస్తారు.
రింగ్ రోడ్ ? ఏది మాస్టర్ ప్లాన్ రెడీ అయ్యాక కూడా ఇంకా రిలీజ్ చేయ్యకుండా అడ్డుకున్నారు.
ప్రజలు ఎవ్వరు మీ మాట వినే పరిస్థితి లేదు
హన్మకొండలో ఎం.ఎల్.ఏ. వినయ్ భాస్కర్ మరియు అతని అనుచరులు నగరంలో విపరీతంగా భూకబ్జాలు చేసారు.
సెటిల్ మెంట్ల పేరుతో భూములు ప్రజలను భయభ్రాంతులను చేసి భూములు లాకుంటున్నారు.
నాలుగు సార్లు ఎం.ఎల్.ఏ.గా ఉండి ప్రజలకు ఏం చేసావు, nagara అభివృద్ధి కుంటుబడింది.
కమీషన్లకు కక్కుర్తి పడి కాంట్రాక్టర్లను పనులు చేసుకోనివ్వకుండా వరంగల్ నగర అభివృద్ధిని అడ్డుకున్నాడు.
అభివృద్ధిపై నిలదీస్తే మా కార్యకర్తలపై దాడులకు చేసి భయభ్రాంతులను చేసున్న ఈ ఎం.ఎల్.ఏ. మనకు అవసరమా ?
ఇలాంటి ఎం.ఎల్..ఏ. మనకు అవసరమా ? ప్రజలు విద్యావంతులు మేధావులు మీరు గమనించాలని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలంటే మనమందరం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని అప్పుడే అభివృద్ధి జరుగుతుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో లీగల్ సెల్ నాయకులు,తొగరు జగన్మోహన్ రెడ్డి, నల్లా మహాత్మ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *