హన్మకొండ 59వ డివిజన్ నుండి పలువురు నాయిని సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిక
Hanamkondaహన్మకొండ 59వ డివిజన్ నుండి పలువురు నాయకులు జిల్లా సోషల్ మీడియా కో-ఆర్డి నేటర్ కేతిడి దీపక్ రెడ్డి ఆధ్వర్యంలో హన్మకొండ నయీంనగర్ లోని నాయిని రాజేందర్ రెడ్డి స్వగృహంలో నాయిని రాజేందర్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ పార్టీ ఖండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో మొహమ్మద్ సైఫ్, సందీప్, సాయి కృష్ణ, జీవ కిరణ్, శివ కుమార్, అజయ్, వివేక్, శ్రీసాయి, వసంత్, ప్రణయ్, రాజ్ కుమార్, సతీష్, సమీర్, మహమ్మద్ రబ్బాని, అజీజ్, నవీద్, శివమణి, రోహిత్, చరణ్, రాకేశ్, స్టీవెన్, యశ్వంత్, నౌమాన్, ఇషాక్, మధుసూదన్, శివాజీ, వాసు, అమీర్, రాహుల్ తదితరులు.
ఈ సందర్భంగా నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ…
దేశ ప్రజలు రాహుల్ గాంధీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని, యువతకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటుతోనే న్యాయం జరుగుతుందని అన్నారు.
రాబోయే రోజుల్లో కేంద్రం లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అన్నారు.
ముఖ్యమంత్రి కె.సి.ఆర్ విద్యార్థుల బలిదానాలను ఆసరాగా చేసుకొని ప్రభుత్వాన్ని చేపట్టారన్నారు.
ప్రజలు టి.ఆర్.ఎస్.ను నమ్మి అధికారమిస్తే, రాష్ట్ర ప్రజలను యువతను మోసం చేశారని విమర్శించారు.
ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు నిరుద్యోగ భ్రుతి కింద 3016 ఇస్తానని అధికారంలోకి వచ్చి ఆ హామీని తుంగలో తొక్కిండు.
ఈ తోమ్మిదేండ్ల పాలనలో ఇంతవరకు DSC ప్రకటించలేదు.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేఖ విధానాల పట్ల విసుగెత్తి కాంగ్రెస్ పార్టీ లో చేరారు అని బడుగు బలహీన వర్గాల, పేదల సంక్షేమం కేవలం కాంగ్రెస్ పార్టీ ధ్వారా నే సాధ్యం అని అన్నారు.
ఈ కార్యక్రమంలో టిపిసిసి సోషల్ మీడియా కార్యదర్శి మహమ్మద్ ముస్తాక్ నేహళ్, ఒబిసి డిపార్టుమెంటు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ వైస్ చైర్మన్ సిరబోయిన సతీష్, ,మహమ్మద్ ఇర్షాద్, మహమ్మద్ అస్లం, మహమ్మద్ అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.