హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలి: డీవైఎఫ్ఐ
Hanamkondaఖజిపేట, ఎస్సై కానిస్టేబుల్ అభ్యర్థులకు న్యాయం చేయాలని, పాత పద్ధతిలోనే ఈవెంట్స్ ను కొనసాగించాలని, హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం భారత ప్రజాతంత్ర యువజన సమేఖ్య డీవైఎఫ్ఐ ఖజిపేట మండల కమిటీ ఆధ్వర్యంలో దున్నపోతుకు వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు మండల కార్యదర్శి, చిలుక జంపన్న, అధ్యక్షలు శివరాత్రి కర్నాకర్లు మాట్లాడుతూ న్యాయం కోసం ఎస్ఐ, కానిస్టేబుల్ అభ్యర్థులు పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, అర్హత విభాగాలు మొత్తం తప్పుల తడక్కగా ఉందని, తప్పులను సవరించాలని, పరుగు పందెం కు సంబంధించిన ఉత్తీర్ణత సాధించినప్పటికీ, లాంగ్ జంప్ విభాగంలో పురుషులకు 3.80 మీటర్లు, స్త్రీలకు 2.20 మీటర్లు వుంటే ఇటీవల తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు దానిని సవరించి పురుషులకు 4.00 మీటర్లు, స్త్రీలకు 2.50 మీటర్లకు పెంచిందని, అలాగే షాట్పుట్ విభాగంలో గతంలో పురుషులకు 5.60 మీటర్లు, స్త్రీలకు 3.75 మీటర్లు వుంటే దానిని పురుషులకు 6.00 మీటర్లకు, స్త్రీలకు 4.00 మీటర్లకు గణనీయంగా పెంచిందని, కొత్తగా తీసుకొచ్చిన నిబంధనల కారణంగా లక్షలాది మంది అభ్యర్థులు ఉత్తీర్ణతను సాధించలేకపోయారని, రాష్ట్ర ప్రభుత్వం కక్షపూరితంగానే నిరుద్యోగులకు నష్టం చేస్తున్నదని, టీఎస్ఎల్ పీఆర్బీ బోర్డ్ వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామికమని అన్నారు. లాంగ్ జంప్ దూరంలో 3.8 మీటర్ల నుండి 4 మీటర్ల కు పెంచడంతో అనేక మంది అభ్యర్థులు నష్టపోతున్నారని, ఎత్తు కొలతలను డిజిటల్ పద్ధతి ద్వారా ఎత్తు కొలవడంతో సాంకేతిక లోపం వల్ల చాలా మంది అభ్యర్థులు అర్హత కోల్పోయారన్నారు. రన్నింగ్ లో అర్హత సాధించిన అభ్యర్థులకు సివిల్, కమ్యూనికేషన్, ఫైర్, జైల్, ఎక్సైజ్ విభాగాల్లో మెయిన్స్ పరీక్షకు అవకాశం కల్పించాలని, లాంగ్ జంప్ ఆన్ ద లైన్ జంప్ ను అనుమతించాలని, డిజిటల్ విధానాన్ని రద్దు చేసి, పాత పద్ధతినే మాన్యువల్ గా అభ్యర్థుల ఎత్తు కొలతలను తీసుకోవాలని లేని పక్షంలో ఆందోళనలు ఉదృతం చేస్తామని, ఎస్ఐ,కానిస్టేబుల్ అభ్యర్థులకు ప్రిలిమ్స్ పరీక్షలలో తప్పుగా వచ్చిన ప్రశ్నలకు మార్కులను కలపాలంటూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయని, టి ఎస్ ఎల్ పి ఆర్ బి ఛైర్మన్ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు అనిల్, ప్రణయ్, రవీందర్, నర్సింహ తదితరులు పాల్గొన్నారు.