16 కేజి ల గంజాయి పట్టివేత

ఖమ్మం ఎక్సైజ్ డిప్యూటీ ఎన్ఫోర్మెంట్ అసిస్టెంట్ కమిషనర్ గణేష్ ఆదేశాలతో ఏ ఈ ఎస్ తిరుపతి సూచనలతో సీఐ సర్వేశ్వరరావు ఆదేశాలతో ఎన్ఫోర్స్మెంట్ టీం భద్రాచలం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అంబేద్కర్ సెంటర్, బస్టాండ్, ఎక్సైజ్ చెక్పోస్ట్ దగ్గర వాహనాలు తనిఖీలు నిర్వహించగా తెలంగాణ రాష్ట్ర భూపాలపల్లి జిల్లా కి చెందిన 1) ఎక్కల యశ్వంత్ 2)మోకాడి అజయ్ సంజయ్ ల వద్ద నుండి 16.8 కేజిల గంజాయి ఒక హోండా డియో బైక్ నీ స్వాధీనం చేసుకున్నారు.
వారిని విచారించగా ఒడిస్సా రాష్ట్రం మల్కానగిరి వద్ద గంజాయి నీ కొనుగోలు చేసి భూపాలపల్లి కి తీసుకెళ్ళి అక్కడ చిన్న చిన్న పాకెట్స్ ఒకో పాకెట్ 500/- లకు విక్రయిస్తాం అని ఈ విధమైన వ్యాపారం గత కొంత కాలంగా నుండి చేస్తున్నాం అని ఒప్పుకున్నారు.
తదుపరి చర్యలు నిమిత్తం వారిని స్థానిక ఎక్సైజ్ స్టేషన్ భద్రాచలం లో అప్పగిస్తామని సి ఐ సర్వేశ్వరరావు తెలిపారు. ఇట్టి దాడులలో ఎస్ ఐ లు ముబషిర్ అహ్మద్, అనిల్ హెడ్ కానిస్టేబుల్, కరీం, బాలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *