3వ విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను మోసం చేస్తే ఉరుకొం
Uncategorizedజనగామ పట్టణంలో 3వ విడత ఇందిరమ్మ పేరుతో 3డవ విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులను మోసం చేస్తే ఉరుకొమని హెచ్చరించారు. గత కాంగ్రెస్ ప్రభుత్వం 2013లో అర్హులైన 1146 నిరుపేద లబ్దిదారులలో కొంతమందికి పట్టాలు ఇవ్వడం, మరో కొంతమంది పేర్లను ప్రకటించారు తప్ప, ఇండ్లస్థలాలను చూపకపోవడంతో లబ్ధిదారులు సిపిఎం ఆధ్వర్యంలో ప్రభుత్వ లబ్ధిదారులకు కేటాయించిన స్థలాలలో ఇండ్లు నిర్మించుకున్నారని తెలిపారు. ఈ సందర్బంగా జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి గారు ఇందిరమ్మ లబ్ధిదారులతో, సిపిఎం నాయకత్వంతో డబల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇవ్వడం జరిగిందని గుర్తు చేశారు. రెవిన్యూ అధికారులు నిర్మించుకున్న ఇండ్లును వదిలిన లబ్ధిదారులను కాకుండా, ప్రస్తుత వార్డులలో వార్డుసభల ద్వారా లబ్ధిదారుల ఎంపిక చేస్తామని చెప్పడంతో ఇందిరమ్మ లబ్ధిదారులు నిర్మాణంలో ఉన్న డబల్ బెడ్రూమ్ ఇండ్ల వద్దనే దీక్షలు చేపట్టడంతో జిల్లా ఉన్నతాధికారులు లబ్ధిదారులు, సిపిఎం నాయకత్వంతో మళ్ళీ చర్చలు జరిపి గతంలో ప్రకటించిన లబ్దిదాలకే ఇండ్లు ఇస్తామని చెప్పడం జరిగిందన్నారు. జిల్లా ఉన్నతాధికారులు 3డవ విడత ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకోకుండా, మళ్లీ వార్డుల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేస్తామని చెప్పడం సరైనది కాదని విమర్శించారు. గత ఐదు సంవత్సరాలనుండి జిల్లా కలెక్టర్, ఆర్డిఓ తహసీల్దార్, సంబంధిత అధికారులు ఇందిరమ్మ లబ్ధిదారులను మభ్యపెట్టి చివరకు మొండి చెయ్యిచూపే ప్రమాదం ఉందని హెచ్చరించారు. 3డవ విడత ఇందిరమ్మ లబ్ధిదారులకు కేటాయించిన డబల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తి కాకముందే లబ్ధిదారుల ఎంపిక ఏవిధంగా చేస్తారని ప్రశ్నించారు? పేద ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే అసంపూర్తిగా ఉన్న డబల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం వెంటనే పూర్తి చేసి 3డవ విడత ఇందిరమ్మ లబ్ధిదారులకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం అధికారులు మాటతప్పి 3డవ విడత ఇందిరమ్మ లబ్ధిదారులతోపాటు, మీసేవలలో దరఖాస్తులు పెట్టిన వారికి సర్వేలు చేపట్టడం అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు. 3డవ విడత ఇందిరమ్మ లబ్ధిదారులు కాకుండా మీసేవలో దరఖాస్తులు చేసిన వారికి ఇండ్లు ఇవ్వాలని చూస్తే, 3డవ విడత ఇందిరమ్మ లబ్ధిదారుల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ స్పష్టమైన హామీ ఇస్తేనే ఈ నిరాహార దీక్షలను ఆపుతామని లేదంటే ఈ దీక్షలను 3డవ విడత ఇందిరమ్మ లబ్ధిదారులకు ఇండ్లు అప్పగించే వరకు కొనసాగుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బాలమైన మైసమ్మ, బండవరం శ్రీదేవి, మచ్చ వరలక్ష్మి, నాచు అరుణ, పుట్ట ఉప్పలమ్మ, రాపోలు రజిత, వల్లాల భాగ్య లక్ష్మి, పొన్నాల ఉమా, పి. శారద, ఎర్ర రజిత, బి. ఇందిర, ఎండి. నజియా, బి. శాంత, ఉమా, జి. శ్రీలత, ఇ. మధు తదితర లబ్ధిదారులు పాల్గొన్నారు.