ప్రపంచ సంక్షోభం మరియు శాంతి మార్గం"అనే గ్రంధం బహుకరణ హన్మకొండ డిసెంబర్ 01 నేడు ప్రపంచం అనేక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతున్నదని, శాంతి నెలకొల్పాలంటే ధార్మిక పరంగానే సాధ్యమవుతుందని,కుల మతాలకతీతంగా ప్రపంచ శాంతిని నెలకొల్పేందుకు అందరూ కృషి చేయాలని అంతర్జాతీయ అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ఆంధ్ర, తెలంగాణ ప్రతినిధి సజీల్ గోరి అన్నారు.గత రెండు రోజులుగా హన్మకొండ,వరంగల్ పట్టణంలోని అనేక ప్రభుత్వ ఉన్నత అధికారులతో కలిసి అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ఐదవ ఖలీఫా హజరత్ మీర్జా మస్రూర్ అహ్మద్ ప్రసంగాల క్రోడీకరణ"ప్రపంచ సంక్షోభం మరియు శాంతి మార్గం"అనే గ్రంధమును బహుకరించడం జరిగింది. గురువారం హన్మకొండ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మరియు వరంగల్ అడిషనల్ ఇంచార్జ్ కలెక్టర్ శ్రీ వాస్తవ కోట మరియు వివిధ ప్రభుత్వ అధికారులకు,ఉన్నతాధికారులకు ఇస్లాం యొక్క శాంతి బోధనల గురించి సమగ్ర సమాచారాన్ని అందజేసి,అందరిని ప్రేమించు ఎవరిని ద్వేషించకు అనే నినాదంతో ప్రపంచవ్యాప్తంగా అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ చేస్తున్న సేవలను వివరించారు.ఈ సందర్భంగా వారితో పాటు అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా ఉపాధ్యక్షులు ముహమ్మద్ సలీం,సర్కిల్ ఇంచార్జ్ మహమ్మద్ అక్బర్ స్థానిక మౌల్వీ మహమూద్ అహ్మద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.