హైదరాబాద్ లో జరిగే ఎస్.ఎఫ్.ఐ 17వ జాతీయ మహాసభలను జయప్రదం చేయండి…
Khammamఓయూ ఠాగూర్ ఆడిటోరియంలో జరిగే డిసెంబర్ 13 నుండి 16 వరకు ఎస్.ఎఫ్.ఐ జాతీయ మహాసభలను విజయవంతం చేద్దాం..
ఎస్.ఎఫ్.ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి వడ్రనఖమ్మం :- ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఎస్.ఎఫ్.ఐ జాతీయ మహాసభల వాల్ పోస్టర్ ను ఏ ఎస్ ఆర్ కాలేజీలో ఆవిష్కరణ… ఈ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి వడ్రనపు మధు మాట్లాడుతూ :- ఎస్.ఎఫ్.ఐ 17 జాతీయ మహాసభలకు దేశంలోని 29 రాష్ట్రాల నుండి 800 లకు పైగా విద్యార్థి ప్రతినిధులు హాజరవుతున్నారు. ఈ మహాసభలో నాలుగు రోజుల పాటు దేశంలోని విద్య, ఉపాధి, ఇతర రంగాల గురించి లోతైన చర్చ జరుపనున్నారు. విద్యారంగంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు మౌలిక సదుపాయాలు, ప్రొఫెసర్ల కొరత, ప్రభుత్వ యూనివర్సిటీల పరిస్థితి, పైన భవిష్యత్తు ఉద్యమాన్ని కార్యచరణ రూపొందిస్తారు. ఈ మహాసభల సందర్భంగా విద్యార్థులతో భారీ బహిరంగ సభను ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్నారు. దీనికి ముఖ్య అతిథిగా త్రిపుర రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్, హాజరవుతారు.. కావున విద్యార్థులు పెద్ద మొత్తంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా పిలిపిస్తున్నాము.. ఈ మహాసభలకు విద్యార్థులు, యువకులు, మేధావులు, ప్రొఫెసర్లు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా ఆయన కోరారు.. ఈ కార్యక్రమం జిల్లా సహాయ కార్యదర్శి పోనుకుల సుధాకర్, ఖమ్మం నగర కన్వీనర్ తరుణ్, ASR కాలేజీ అధ్యక్ష కార్యదర్శులు శ్రీనివాస్, శ్రీకాంత్, గర్ల్స్ కన్వీనర్ వినీల, అనిత, నిహారిక, రాజేశ్వరి, రాజు గోవర్ధన్ నితిన్ తదితరులు పాల్గొన్నారు…