మునగాల మండల పరిధిలోని నర్సింహాపురం గ్రామానికి చెందిన సామాజిక ఉద్యమకారులు వేమూరి సత్యనారాయణ మండల పరిధిలోని ముకుందాపురం గ్రామపంచాయతీలో ఉన్న ఇందిరా అనాధ వృద్ధాశ్రమంలో.శనివారం అంగవైకల్యం మురియు మానసిక వికలాంగులను ఘనంగా సన్మానించి మిఠాయి లు పంపిణీ చేశారు .ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ అంగవైకల్యం శరీరానికి మాత్రమే ఆలోచనకి కాదని వికలాంగులను హేళన చేయకుండా. వారి పట్ల ప్రేమానురాగాలు ఆదరాభిమానాలు చూపాలని. ఎంతో మంది వికలాంగులు. ఆత్మస్థైర్యంతో ఆత్మాభిమానంతో పట్టుదలతో సకలాంగులతో. దీటుగా వారెంచుకున్న ఆయా రంగాలలో ఎంతో ఉన్నత స్థాయి కి ఎదిగారని. అవకాశం ఉన్నంత వరకు వారిని మరింత ముందుకు వెళ్లే లాగా ప్రోత్సహించాలని వీరి సంక్షేమం కోసం ప్రభుత్వాలు కూడా మరింత ప్రోత్సాహకారాలు అందించాలని వీరి సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ ను ప్రవేశ పెట్టి వీరిని ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో మారేపల్లి శ్రావణి యల్లమ్మ కోటయ్య నవ్య మల్లమ్మ లను. సన్మానించారు. ఇట్టి కార్యక్రమంలో. వీర బోయిన నాగరాజు మారేపల్లి శ్రీను రమ నీలమ్మ ఆశ్రమం నిర్వాహకురాలు నాగిరెడ్డి విజయమ్మ తదితరులు పాల్గొన్నారు