ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
Jangaon**ఈ69 న్యూస్ జఫర్ఘడ్:-కాంగ్రెస్ పార్టీ 138 వ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా జాఫర్ గడ్ మండల కేంద్రంలో స్టేషన్గన్పూర్ మాజీ మార్కెట్ చైర్మన్ అన్నేబోయిన బిక్షపతి కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించి పండ్ల పంపిణి చేశారు.ఈ సందర్భంగా అన్నేబోయిన బిక్షపతి మాట్లాడుతూ..1885 డిసెంబర్ 28 న అఖిల భారత కాంగ్రెస్ పార్టీని మాజీ బ్రిటీష్ అధికారి ఏ.ఓ హ్యూమ్ స్థాపించారని,భారతదేశ స్వాతంత్ర్యం కోసం కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎందరో మహానుభావులు శ్రమించారన్నారు.వారిలో మహాత్మా గాంధీ,బి.ఆర్. అంబేద్కర్,మొదలగు అనేక మంది ఇందులో సభ్యులుగా ఉండి దేశానికి ఎంతో సేవ చేశారని,138 ఏండ్ల మహత్తర చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ, భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడిందని అన్నారు.గాంధీ,నెహ్రూల నాయకత్వములో దేశవ్యాప్త ఉద్యమాలు నిర్వహించి దేశం నుండి ఆంగ్లేయులను తరిమి కొట్టిన పార్టీ కాంగ్రెస్ అని అన్నారు.1947లో స్వాతంత్ర్యం వచ్చిన తరువాత భారతదేశంలో 49 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ,బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికై అనేక సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి బడుగుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిందన్నారు.ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రేస్ స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ అధ్యక్షులు తాటికాయల రాజేందర్ మాజీ జడ్పిటిసి పట్టపురి సదయ్య గౌడ్ ఉప సర్పంచ్ నంచర్ల లతయాదగిరి బీసీ సెల్ అధ్యక్షులు ఓరుగంటి రాజు మండల సీనియర్ నాయకులు మెరుగు ఎల్లా గౌడ్ వార్డ్ మెంబర్స్ పట్టపురి రాధిక విజయ్ గౌడ్ మరియు మంచాల మమత అనిల్ గ్రామ శాఖ అధ్యక్షులు మామిడి శ్రీనయ్య మరియు సముద్రాల సారంగం సముద్రాల సత్యనారాయణ బక్కం కొమురయ్య తాటికాయల యాకయ్య మంచాల రాజు గుడ్డేటి ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.