ఈ69 న్యూస్ ఏలూరు:ఉమ్మడి పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లా పెదవేగి మండలం రాయనపాలెం గ్రామంలో అహ్మదీయ ముస్లిం కమ్యూనిటీ వయోజన సమితి వార్షిక ఇజ్తిమా ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వయోజన సమితి అధ్యక్షుడు రిజ్వాన్ సలీం మాట్లాడుతూ…ఇజ్తిమాలు,జల్సాలు,సమావేశాలు ముస్లింలలో ఆధ్యాత్మికత పెంపొందించడమే కాకుండా సామాజిక బంధాలను బలపరుస్తాయి అని పేర్కొన్నారు.వయోజనులు తమలో ధార్మికత పెంపొందించుకుని,తమ జీవిత అనుభవాలను కొత్త తరానికి పంచుతూ మార్గనిర్దేశం చేయాలని ఆయన సూచించారు.వయోజనుల ద్వారానే సమాజంలో మార్పు సాధ్యమవుతుంది అని అన్నారు.సమావేశానికి అధ్యక్షత వహించిన జిల్లా ఇంచార్జి మౌల్వీ జాఫర్ ఖాన్ సమాజ ఐక్యత,సత్యనిష్ఠ,ఆధ్యాత్మిక జీవన ప్రాముఖ్యతపై ప్రసంగించారు.ఈస్ట్ గోదావరి జిల్లా సర్కిల్ ఇంచార్జి సిరాజ్,కృష్ణా జిల్లా ఇంచార్జి యాకూబ్ పాషా,ఖమ్మం జిల్లా ఇంచార్జి అక్బర్ సమితి కార్యకలాపాల అవసరాన్ని వివరించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులకు,వయోజనులకు గుర్తుగా బహుమతులు అందజేశారు.కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు షేక్ బాజీ,స్థానిక అధ్యక్షుడు షేక్ మస్తాన్ వలీ,వయోజన సమితి స్థానిక అధ్యక్షుడు భవానీ,యూత్ సమితి జిల్లా అధ్యక్షుడు షేక్ మునవ్వర్ అహ్మద్ మస్తాన్,ఉమ్మడి వరంగల్ జిల్లా వయోజన సమితి అధ్యక్షుడు ముహమ్మద్ సలీం,జిల్లా కమిటీ సభ్యుడు అక్బర్,మౌల్వీలు సుల్తాన్,హిక్మత్,ముబష్షిర్,ఇస్మాయిల్,నబీ,రఫీ,ఎజాజ్,అమీర్,తయ్యబ్ తదితరులు పాల్గొన్నారు.సమీప గ్రామాల నుండి పెద్ద సంఖ్యలో వయోజన ముస్లింలు,యువత హాజరై ఉత్సాహంగా సమావేశాన్ని విజయవంతం చేశారు.