టీచర్స్ ఫెస్ట్ 2023*సావిత్రీబాయి192 వ జయంతి వేడుకలు
Hyderabad*విజ్ఞానదర్శిని వుమెన్ *సావిత్రిబాయి పూలే 192వ జన్మదిన సందర్భంగా విజ్ఞాన దర్శిని సంస్థ నిన్న నేడు నిర్వహించిన ఉమెన్స్ టీచర్ ఫెస్ట్ 2023 నేడు ముగింపు వేడుకలు కనుల పండుగ జరిగాయి.వివిధ విభాగాల్లో ఉమెన్స్ టీచర్స్ కు నిర్వహించిన పోటీలలో గెలుపొందిన వారికి బహుమతులు అందజేయడం జరిగింది. ఆరు విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీలలో ఒకటి రెండు మూడు రూ.7,000 5,000 3,000 చొప్పున నగదు బహుమతులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన విజ్ఞాన దర్శిని ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ టి రమేష్ గారు ఉపాధ్యాయురాళ్ళను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విజ్ఞానంతో కూడిన విద్య అందించాలని సావిత్రిబాయి పూలే లాగా సమాజ సేవ. చదువు అందరికీ అందించాలని కోరారు వివిధ జిల్లాల నుండి వచ్చిన ఉపాధ్యాయులు నిన్న నేడు ఉత్సాహంగా పలు పోటీల్లో పాల్గొనడం జరిగింది.తెలంగాణ మహిళ కమిషన్ సెక్రటరీ కృష్ణ కుమారి గారు సభను ఉద్దేశించి మాట్లాడుతూ మూఢనమ్మకాలు లేని వైజ్ఞానిక సమాజం కోసం ఉపాధ్యాయురాళ్ళు తమ వంతు కృషి చేయాలని కోరారు. ఏదైనా కుటుంబ సామాజిక సమస్యలు ఎదురైనప్పుడు తమను సంప్రదించి న్యాయం పొందాలని వారి చిరునామాలు ఉపాధ్యాయులకు ఇచ్చారు మహిళ టీచర్లు సరైన విజ్ఞానం విద్యార్థులకు అందించినప్పుడు మంచి సమాజం ఏర్పడుతుందని తద్వారా వివక్ష లేని మూఢనమ్మకాలు లేని సమాజం వచ్చే అవకాశం ఉందని సాంకేతికతో పాటు విద్యార్థులకు సమాజ సేవ గురించి కూడా చెప్పాలని కోరారు.మరో వక్త ఉస్మానియా మెడికల్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ప్రతిభా లక్ష్మీ గారు ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు విద్యా విధానం లో ఉన్న కొన్ని లోపాలను సరిదిద్ది నిజమైన విద్యను అపోహలు లేని నాలెడ్జిని పిల్లలకు అందజేయాలని కోరారు.ప్రకృతికవి జయరాజు గారు మాట్లాడుతూ ప్రకృతిని స్త్రీలను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ప్రతి స్త్రీ సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని తన మాట పాటలతో చెప్పారు.తెలంగాణ కోకిల గాయని భూదేవి గారు తన ఉపాధ్యాయుల లో పాటలతో సభ సభ్యులను అలరించారు ఈ పాటలతో విద్యార్థి ఉపాధ్యాయుల్లో మంచి ఉత్సాహం నింపారు. కార్యక్రమంలో విజ్ఞాన దర్శిని సంస్థ నాయకూ తులసీరామ్, శోభారాణి, విజయ కందుకూరి, నాస్తిక్ సూర్య, శ్రీ తేజ శివరాం, విష్ణువర్ధన్, మహేష్, ఆలీ, అఫ్రం బాల నారాయణ, రాజు, సాగర్ తదితరులు పాల్గొన్నారుఈ సభలో విజ్ఞానదర్శిని సభ్యులు చేసిన మిరాకిల్ ఎక్స్పోజర్ కార్యక్రమాలు చాలామందిని ఆలోచింపజేశాయి. మాయలు మంత్రాలు లేవని ఉన్నదంతా సైన్సేనని మాయ మంత్రాలు పేరుతో జరిగే మోసాలకు దూరంగా ఉండాలని వారు తమ మ్యాజిక్స్ తో విద్యార్థి ఉపాధ్యాయులకు చూపారు.రమేష్అధ్యక్షుడువిజ్ఞానదర్శిని