పశు మిత్రలకు వేతనం నిర్ణయించి పని భద్రత కల్పించాలి
Jangaon**సిఐటియు జిల్లా కార్యదర్శి రాపర్తి రాజు
*~~~~~~~~~~~~~~~~*జనగామ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పశు వైద్య ఆరోగ్యశాఖలో పశుమిత్రలగా సేవాలాందిస్తున్న వారిని గుర్తించి ప్రభుత్వం వేతనాలు ఇవ్వాలని పని భద్రత కల్పించాలని సిఐటియు జిల్లా కార్యదర్శి రాపర్తి రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు* *గురువారం సిఐటియు జిల్లా కార్యాలయంలో ఏర్పాటుచేసిన పశు మిత్ర యూనియన్ జిల్లా సమావేశానికి ఎండి నజీయా బేగం అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగాసిఐటియు జిల్లా కార్యదర్శి రాపర్తి రాజు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో 2500 మంది పశుమిత్రలు గత 8 సంవత్సరాల నుండి ఎలాంటి వేతనం తీసుకోకుండా పశు వైద్య ఆరోగ్య శాఖలో పశువులకు సేవలందిస్తున్నారని తెలిపారు రైతులకు సంబంధించిన ఆవులు గేదెలు గొర్రెలు మేకలు జంతువుల ఆరోగ్య సమస్యలను రాత్రనకా పగలనకా రైతుల పిలువగానే వెళ్లి వ్యాక్సిన్ లు, టీకాలు ,నట్టల మందులు ,వ్యాధి నివారణ చర్యలు చేపడుతున్నారు ఇందులో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు ప్రభుత్వం వెట్టిచాకిరి చేయించుకుంటున్నది ఇప్పటికీ వారికి వేతనం ఇవ్వాలని నిర్ణయించకపోవడం దారుణం ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పశుమిత్రలను గుర్తించి వేతనం ఇవ్వాలని పని భద్రత కల్పించాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు బొట్ల శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు*నూతన జిల్లా కమిటీ ఎన్నిక*గౌరవ అధ్యక్షులుగా రాపర్తి రాజుఅధ్యక్షులుగా ఎండి నజీయాబేగం ప్రధాన కార్యదర్శిగా భీ మంగ ఉపాధ్యక్షులుగా చిలువేరు సంధ్య ఎం మనీలా సహాయ కార్యదర్శులు గా దూసరి శ్రావణి కంకటి అనిత కోశాధికారిగా నీలం సరళ కమిటీ సభ్యులుగా వై స్వప్న ఎస్ అనిత ఆర్ స్వప్న సిహెచ్ కోమల మంజుల జె సంధ్యారాణి బి రాజేశ్వరి బి స్రవంతి జే పద్మ పి రాణి కె సంధ్య 22 మందితో నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు తెలిపారు*