వంగాలపల్లిలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవములు మరియు శంఖుస్థాపనలు చేసిన…ఎమ్మెల్యే డా.రాజయ్య
Jangaonతేది: 05.01.2023 ,
వంగాలపల్లి.
వంగాలపల్లిలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవములు మరియు శంఖుస్థాపనలు చేసిన…ఎమ్మెల్యే డా.రాజయ్య
రూ. 4.00 లక్షలతో నూతనంగా నిర్మించిన పల్లెప్రకృతి వనం(PPV) ప్రారంభించిన…ఎమ్మెల్యే డా.రాజయ్య
ఎంజీఎన్ఆర్ఈజిఎస్ నిధుల నుండి రూ.20.00 లక్షలతో నూతనంగా నిర్మించిన అంతర్గత సీసీ రోడ్స్ ను ప్రారంభించిన…ఎమ్మెల్యే డా.రాజయ్య
జడ్పీ నిధుల నుండి రూ.5.00 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సైడ్ డ్రైన్ నిర్మాణానికి భూమిపూజ చేసిన…ఎమ్మెల్యే డా.రాజయ్య
బిఆర్ఎస్ ప్రభుత్వం ఒక అక్షయపాత్ర…ఎమ్మెల్యే డా.రాజయ్య
అభివృద్ధి నిరంతర ప్రక్రియ…ఎమ్మెల్యే డా.రాజయ్య
ఈ రోజు…చిల్పూర్ మండలం , వంగాలపల్లి గ్రామంలో తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి , ఎమ్మెల్యే డాక్టర్.తాటికొండ రాజయ్య గారు రూ.29.00 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవములు మరియు శంకుస్థాపనలు చేశారు. మొదటగా ఉపాధి హామీ నిధుల నుండి రూ: 4.00 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించిన పల్లెప్రకృతి వనం(PPV) ను ఎమ్మెల్యే డా.రాజయ్య రిబ్బన్ కట్ చేసి ప్రారంభోత్సవం చేశారు.
అనంతరం వంగాలపల్లి గ్రామంలో రూ:20.00 లక్షల అంచనా వ్యయంతో నిర్మించనున్న నూతన అంతర్గత సిసి రోడ్స్ ను ఎమ్మెల్యే గారు ప్రారంభోత్సవములు చేశారు. అదేవిధంగా జడ్పీ నిధుల నుండి రూ:5.00 లక్షల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మించనున్న సైడ్ డ్రైన్ నిర్మాణానికి భూమిపూజ చేశారు.
అనంతరం గ్రామసర్పంచ్ అరూరి ప్రణీత గారి అధ్యక్షతన జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ తొలి ఉపముఖ్యమంత్రి , ఎమ్మెల్యే డాక్టర్.తాటికొండ రాజయ్య గారు ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాల్ని ఉధ్యేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ…వంగాలపల్లి గ్రామంలో రూ:29.00 లక్షలతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవములు మరియు భూమిపూజ చేసుకున్నామని ఎమ్మెల్యే డా.రాజయ్య అన్నారు.
పల్లెప్రగతి అనే వినూత్నమైన కార్యక్రమం ప్రవేశపెట్టి పల్లెప్రగతి ద్వారా రాష్ట్రంలో ఉన్న 12769 గ్రామపంచాయతీలకు నెలకు తలకోకంటికి 1632 /- రూపాయల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలకు ప్రతినెల రూ.256 కోట్లు మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.
భారతదేశంలోని 29 రాష్ట్రాలలో ఎక్కడ లేని విధంగా ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ప్రతి గ్రామానికి ఒక నర్సరీ , ఒక వైకుంఠదామం , ఒక పల్లెప్రకృతి వనం , ఒక సెగ్రీగేషన్ షేడ్ , ఒక డంపింగ్ యార్డు , ఒక క్రీడా ప్రాంగణం వంటి మౌళిక సదుపాయాలతో పాటు ఒక ట్రాక్టర్ , ట్రాలీ మరియు ట్యాంకర్ వంటి సదుపాయాలు కల్పించిన ఘనత సీఎం కేసీఆర్ గారికే దక్కుతుందని తెలిపారు.
ఇవే కాక రైతును రాజును చేయడానికి రైతుబంధు ద్వారా సంవత్సరానికి ఎకరానికి పదివేల రూపాయలు పెట్టుబడి సాయం అందిస్తూ , వ్యవసాయానికి 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్తు అందిస్తూ గుంట భూమి ఉన్న రైతు చనిపోయిన కూడా రైతు బీమా ద్వారా ఐదు లక్షల బీమా సౌకర్యం అంధించడం జరుగుతుందని తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి గోదావరి నీళ్లు త్రాగునీరుగా అందిస్తూ మిషన్ కాకతీయ ద్వారా రాష్ట్రంలో ఉన్న 46 వేల చెరువులను పునరుద్ధరణ చేయడమే కాకుండా కాళేశ్వరం లాంటి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ప్రాజెక్టు నిర్మించి 585 టిఎంసిల నీటిని నిల్వచేసి తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఘనత సీఎం కేసీఆర్ గారికి దక్కుతుందన్నారు.
సంవత్సరానికి ఎకరానికి రూ.10000 /- రూపాయల పెట్టుబడి సాయంగా ఇచ్చే రైతుబంధు , గుంట భూమి ఉన్న రైతు చనిపోయిన కూడా ఐదు లక్షల రైతుబీమా , 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్తు , కళ్యాణలక్ష్మి & షాదీముబారక్ పథకాల ద్వారా పేదింటి ఆడబిడ్డలకు పెళ్లికానుకగా 100116 /- , కెసిఆర్ కిట్టు , అమ్మాయి పుడితే 13000 /- , అబ్బాయి పుడితే 12000 /- ఇవ్వడమైతేనేమి ఇలా చెప్పుకుంటూ పోతే శుద్ధికరణ చేసిన మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి స్వచ్ఛమైన త్రాగునీరు అందించడం డబల్ బెడ్ రూమ్ ఇండ్లు దళితులకు దళితబంధు ఇలా చెప్పుకుంటూ పోతే ప్రజాహిత సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్.1 స్థానంలో నిలిచిందని తెలిపారు. 75 గజాల సొంత ఇంటి స్థలం ఉన్నట్లయితే అట్టి వారందరికీ మూడు లక్షల రూపాయల ప్రభుత్వ సహాయం అందించే ఇండ్ల పథకాన్ని మహిళల పేరుమీద ఇస్తానని తెలిపారు. అదేవిధంగా దళితుల సమగ్ర అభివృద్ధి కోసం తీసుకువచ్చిన దళితబంధు పథకాన్ని వంతుల వారిగా , విడుతలవారీగా నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి అందిస్తానని తెలిపారు.
అభివృద్ధి విషయంలో మన గణపురం నియోజకవర్గానికి వస్తే 67 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి కలిగి 8 ఫ్లైఓవర్ బ్రిడ్జిలు అంతేకాకుండా ధర్మసాగర్ , గణపురం , గండిరామారం , చిటకోడూరు , ఉప్పుగల్లు , అశ్వారావుపల్లి మరియు నవాబుపేట రిజర్వాయర్లు లాంటి 8 రిజర్వాయర్లు కలిగిన నియోజకవర్గం అని తెలిపారు. అందులో అశ్వారావుపల్లి చిటకోడూరు మరియు నవాబుపేట రిజర్వాయర్ లతో రానున్న రోజుల్లో లింగాలగణపురం మండలం సస్యశ్యామలం అవుతుందని తెలిపారు.
ఇండ్లు లేకుండా ఉండి ఇండ్లు కట్టుకొనుటకు ఇంటి స్థలం ఉండి ఇందిరమ్మ ఇండ్లు రానివారికి కొత్తగా ఇవ్వబోయే ఇండ్లు కూడా మహిళల పేరిట మంజూరు చేస్తామని తెలిపారు.
ఈ గ్రామంలో మహిళా సమాఖ్య భవనం నిర్మించుకొనుటకు గాను స్థలం ఉండినట్లయితే మహిళా భవనం మంజూరు ఇస్తానని తెలిపారు
ఈ విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒక తెలంగాణ రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో అమలు చేయబడుతున్నాయని తెలిపారు. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక అక్షయ పాత్ర లెక్క ఏది అడిగితే అది ఇచ్చే విధంగా అభివృద్ధి మరియు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి దక్కుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అందుబాటులో ప్రజాప్రతినిధులు , ముఖ్య నాయకులు , సంబంధిత శాఖల అధికారులు , గ్రామప్రజలు మరియు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.