భారతీయ జనతా పార్టీ పరకాల శాఖ ఆధ్వర్యంలో ధర్నా
నరేంద్ర మోడీ భారత దేశ సైన్యానికి స్వేచ్ఛ ఇచ్చి దాడులు చేస్తున్నారని కాంగ్రేస్ ప్రభుత్వం అక్కస్సుతో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓడిపోతున్నామనే ఉద్దేశంతోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని జయంతి లాల్ అన్నారు.జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి భయపెట్టే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని అన్నారు.భారత సైన్యాన్ని అవమానపరిచిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ పరకాల శాఖ తరపున డిమాండ్ చేస్తున్నామని జయంత్ లాల్ అన్నారు. పాకిస్తాన్ తీవ్రవాదులను ఇంటికి పిలిచి అల్లుడిగా చూసుకున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సిగ్గులేని నిజమైన చరిత్ర అని మాజీ కౌన్సిలర్ మేఘనాథ్ ఘాటుగా విమర్శలు గుప్పించారు. అలాగే భారత సైన్యం యొక్క శక్తి సమర్థ్యలను ప్రపంచ యుద్దానిపుణులుగా ఏక ఖంటంతోని కొనియాడుతుంటే రేవంత్ రెడ్డి నీ కళ్ళు మూసుకుపోయాయా అని ప్రశ్నించారు.కేవలం ఓటు బ్యాంకు కోసం మైనారిటీ సంతృష్టికరణ కోసం పాకిస్తాన్ తొత్తుగా మారిన రేవంత్ రెడ్డి నీకు ముఖ్యమంత్రి గా కొనసాగే అర్హత ఒక్కనిమిషం కుడా లేదని వెంటనే రాజీనామా చేసి దేశ సైన్యానికి దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని భారతీయ జనతా పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నామని మేఘనాథ్ అన్నారు.నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయ్యాక మూడుసార్లు పాకిస్తాన్ తీవ్రవాదుల మీద దాడి చేశారని పాకిస్తాన్ దేశంలో స్వచ్ఛ మట్టుబెట్టామని అన్నారు.