* హన్మకొండ, అక్రమ అరెస్టు లతో ఉద్యమాన్నీ ఆపలేరని డీవైఎఫ్ఐ హన్మకొండ జిల్లా అధ్యక్షులు నోముల కిషోర్ అన్నారు. సోమవారం పోలీస్ రిక్రూట్మెంట్ లో జరిగిన అవకతవకలు అరికట్టాలని, పాత పద్ధతిలోనే రిక్రూట్మెంట్ కొనసాగించాలని నేడు చలో ప్రగతిభవన్ ముట్టడి కార్యక్రమానికి వెళ్లకుండా డీవైఎఫ్ఐ జిల్లా నాయకులకు ముందస్తుగా అరెస్టులు చేయడం సరికాదన్నారు. నిన్న అర్ధరాత్రి జిల్లా లో డీవైఎఫ్ఐ నాయకులందని దొంగలలాగా అరెస్ట్ చేయడం సరికాదన్నారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలు ఆపలేవు పోలీస్ రిక్రూట్మెంట్ లో అన్యాయం జరిగినటువంటి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేంతవరకు పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.