E69 news జఫర్ఘడ్ జనవరి 10 తమ్మడపల్లి(జి) గ్రామానికి చెందిన ఘనపూర్ మాజీ మార్కెట్ కమీటీ చైర్మన్,జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులు అన్నం బ్రహ్మారెడ్డి వీరాభిమాని అయిన కీ శే గుండా రమేష్ ఇటీవల ఆకస్మిక గుండె పోటుతో మరణించడం జరిగింది.వారి వైద్య ఖర్చుల కోసం స్థానిక సర్పంచ్ అన్నెపు పద్మ అశోక్ ప్రత్యేక చొరవ తీసుకొని ముఖ్యమంత్రి సహాయ నిధి కింద 60వేలు మంజూరు చేయించడం జరిగింది.మంగళవారం స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలోని చింతకుంట్ల నరేందర్ రెడ్డి నివాసము నందు మాజీ ఉపముఖ్యమంత్రి,ప్రస్తుత ఎమ్మెల్సీ కడియం శ్రీహరి బాదిత కుటుంబ సభ్యులకు చెక్కును అందజేశారు.తమకు ఆర్ధిక సహాయం అందించుటకు కృషి చేసిన అన్నం బ్రహ్మారెడ్డి,అన్నెపు అశోక్ కు బాదిత కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.