**కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ 2023 నూతన కేలండర్ ను షాద్ నగర్ లో ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం కార్మికుల సమస్యలపై పనిచేస్తున్న సంఘం కార్మిక సంక్షేమ సంఘం అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం తెరాస ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తుంది అన్నారు.. కార్మికుల కష్టాలు తెలిసిన ముఖ్య మంత్రి ఉండటం, అడగకుండానే కార్మికుల సమస్యలు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవటం గర్వించ దగిన విషయం అన్నారు.. అనంతరం ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ను సాల్వా తో సన్మానించి మిఠాయిలు తినిపించారు.ఈ కార్యక్రమంలో కార్మిక సంక్షేమ సంఘం రాష్ట్ర నేత పినపాక ప్రభాకర్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఈట గణేష్, జెడ్పీటీసీ వెంకట్రామిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నటరాజ్, తెరాస సీనియర్ నాయకులు పాతూరి వెంకట రావు, రాజావరప్రసాద్ నక్కల వెంకటేష్ గౌడ్, మలినేని సాంభశివరావు, అశోక్ కుమార్ గౌడ్, అడ్వకెట్ శ్రీనివాస్ రెడ్డి, కార్మిక సంక్షేమ సంఘం జిల్లా నాయకులు రాఘవేందర్ రెడ్డి, నాట్కో యూనియన్ కార్యదర్శి జైపాల్ రెడ్డి, ఇంద్రసేనారెడ్డి, టూ వీలర్ మెకానిక్స్ అధ్యక్షులు సుధాకర్ గౌడ్, కార్యదర్శి భాస్కర్ మరియ ఇప్పల పల్లి సురేష్, సురేందర్, సాయి, శ్రీను, ఆంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.@