ఖమ్మం జిల్లా కేంద్రంగా జనరల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయకపోతే పోరాటాలకు సిద్ధం అవుతాం.
Khammamఎస్.ఎఫ్.ఐ రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు హెచ్చరిక.-యూనివర్సిటీ వస్తే పేద, బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఎంతో ఉపయోగం.-ప్రముఖ విద్యావేత్తలు ఐవి.రమణారావు,రవి మారుతి లు వెల్లడి.-జనరల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఎస్.ఎఫ్.ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తల పిలుపు.-హాజరైన విద్యార్థి,యువజన, ఉపాధ్యాయ ప్రజా సంఘాల నేతలు.-18న సీఎం కేసీఆర్ కి విన్నతిపత్రం ఇవ్వాలని,దశలవారీగా కార్యాచరణకు సిద్దం అవుతున్న ప్రజా సంఘాలు.ఖమ్మం :- ఖమ్మం జిల్లా కేంద్రంగా జనరల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఎస్.ఎఫ్.ఐ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది.. ఈ రౌండ్ టేబుల్ ఎస్.ఎఫ్.ఐ జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్ అధ్యక్షతన జరిగింది.. ఈ రౌండ్ టేబుల్ లో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి తాళ్ల నాగరాజు మాట్లాడుతూ :- జిల్లాలు విడిపోయిన తర్వాత కాకతీయ యూనివర్సిటీ కి గాను 12 జిల్లాలకు యూనివర్సిటీగా కాకతీయ యూనివర్సిటీ ఉందని, రిజల్ట్ ఇవ్వటం గాని ఇతర సమస్యలతో ఇప్పటికే యూనివర్సిటీ విభాగం విఫలమైందని ఆయన అన్నారు.. అలాగే ఖమ్మం కేంద్రంగా జనరల్ యూనివర్సిటీ ఇవ్వకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యం అని, ఖమ్మం జిల్లా నుంచి డిగ్రీ పీజీ చదివే విద్యార్థులు 70,000 నుండి 80,000 వేల మందిని ఉన్నారని, వీరి చదువులో ముందుకు సాగక ఎంతోమందిని విద్యార్థుల భవిష్యత్తు అంధకారమైపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.. ప్రభుత్వం ప్రవేట్ యూనివర్సిటీలను తేవాలని కొట్టాను వీడి.. ప్రభుత్వ యూనివర్సిటీలను ప్రోత్సహిస్తూ ఖమ్మం జిల్లా కేంద్రంగా జనరల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు…ప్రముఖ విద్యావేత్తలు ఐవి.రమణారావు, రవి మారుతి గార్లు మాట్లాడుతూ :- యూనివర్సిటీ వస్తే పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు ఉపయోగం జరుగుతుందని, పేద విద్యార్థులు ఏ సమస్యలు వచ్చినా ఎంతో దూరం వెళ్లి వారి సమస్యలను పరిష్కరించుకోవలసిన పరిస్థితి ఉందని, రెండు మూడు రోజులు ఆ పని అయిపోయినంతవరకు యూనివర్సిటీలోనే ఉండాల్సిన పరిస్థితి ఉందని, అదే ఖమ్మం కేంద్రంగా యూనివర్సిటీ వస్తే పేద ప్రజలకు డబ్బు, సమయం కలిసి వస్తుందని ఆ దిశగా ప్రభుత్వ ఆలోచించాలని వారు అన్నారు… ఎస్.ఎఫ్.ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి మధు మాట్లాడుతూ :- రౌండ్ టేబుల్ కార్యచరణ డిమాండ్స్ ను ప్రకటించారు…1. ఖమ్మం కేంద్రంగా జనరల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యేలకు ఎంపీలకు వినతి పత్రాలు అందజేయాలి..2. ఈనెల 18న సీఎం కేసీఆర్ కు వినతి పత్రం అందజేయాలి..3. వినతి పత్రం సంతకాల సేకరణ నిర్వహించాలి…TS UTF జిల్లా అధ్యక్షులు నాగమల్లేశ్వరరావు, STF జిల్లా కార్యదర్శి యాదగిరి,TTF జిల్లా కార్యదర్శి మంగ్య నాయక్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ( జే ఎన్ యు లీడర్ ) బొంతు రాంబాబు, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రామకృష్ణ, PDSU జిల్లా కార్యదర్శి మస్తాన్, PDSU జిల్లా సహాయ కార్యదర్శి సతీష్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్, DYFI జిల్లా ఉపాధ్యక్షులు రమేష్, AIYF జిల్లా కార్యదర్శి శ్రావణ్, వారు మాట్లాడుతూ :- ఖమ్మం జిల్లా కేంద్రంగా జనరల్ యూనివర్సిటీ ఏర్పాటుకై అందరం కలిసి పోరాటానికి సిద్ధమనివారు అన్నారు… ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు ప్రేమ్ కుమార్, సుధాకర్, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు పర్వీన్ జిల్లా అధ్యక్షులు ఉపేందర్ ఎస్ఎఫ్ఐ ఖమ్మం నగర కార్యదర్శి తరుణ్ SFI నాయకులు అంజలి, సమీరా ,స్రవంతివేణు, శరత్, మహేష్, శరత్, రాజకుమార్, సునీల్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.