రాష్ట్ర సోషల్ మీడియా కో కన్వీనర్ రాపర్తి ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రజకుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతున్న సంఘం తెలంగాణ రజక వృత్తిదాల సంఘం అని తెలిపారు. రాష్ట్రంలో 10 లక్షల మంది రజక వృత్తిదారులు ఉన్నారని 75 ఏళ్ల స్వతంత్ర కాలంలో రజకులు ఆర్థిక ,సామాజిక, రాజకీయ రంగంలో తీవ్రంగా వెనుకబాటుకు గురవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర రజక ఫెడరేషన్ ద్వారా రుణాలు ఇవ్వాలని, గ్రేటర్ హైదరాబాద్ అన్ని డివిజన్ కేంద్రాల్లో మోడ్రన్ దోబీ ఘాటు నిర్మించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉచిత విద్యుత్తు పథకాన్ని ఎల్. టి 4లో చేర్చి అదనపు చార్జీలు పడకుండా చూడాలని కోరారుతార్నాక డివిజన్ అధ్యక్షులు S. శ్రీను నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరించారు * ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు U.నాగేష్,R.శివయ్య,B.వెంకటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.