సమాజ సంస్కరణ మహిళలతోనే సాధ్యం
Warangal-వరంగల్ మహిళా అధ్యక్షురాలు సైదా ఇక్బాల్
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఘనంగా అహ్మదీయ మహిళా శతాబ్ది వేడుకలు
ఈ69 న్యూస్ ఉమ్మడి వరంగల్ జిల్లా జనవరి 15
అహ్మదీయ ముస్లిం జమాత్ ఇంటర్నేషనల్ ఆద్వర్యంలో ఉమ్మడి వరంగల్ జిల్లా లోని తమ్మడపల్లి జి, కొండూరు,పాలకుర్తి,కాట్రపల్లి,రామావరం,నీర్మాల,చిట్యాల,నాంచారిమడూర్,మైలారం,నల్లబెల్లి,ఖాజీపేట,వెంకటాపూర్,పసరగొండ,కటాక్షపూర్ (హౌజ్బుజుర్గ్ )బద్దారం,రవినగర్,నారాయణపూర్,తదితర గ్రామాలలో మహిళా (లజ్నాఇమాయిల్లాహ్)శతాబ్ది జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా వరంగల్ లో స్థానిక అహ్మదీయ మహిళా అధ్యక్షురాలు సైదా ఇక్బాల్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..మహిళల ఆధ్యాత్మిక,ధార్మిక,నైతిక శిక్షణ మరియు పురోగతి కొరకు 25 డిసెంబర్ 1922 సంవత్సరములో లజ్నాఇమాయిల్లాహ్(మహిళా)విభాగం ను అహ్మదీయ ముస్లిం జమాత్ రెండవ ఖలీఫా(ఉత్తరాదికారి)హజ్రత్ మిర్జా బషీరుద్దీన్ మహమూద్ అహ్మద్ స్ధాపించారని అన్నారు.ప్రస్తుత 5వ ఖలీఫా హజ్రత్ మిర్జా మస్రూర్ అహ్మద్ అయ్యదహుల్లాహు తాలా బినస్రిహిల్ అజీజ్ అనుమతితో నేడు యావత్ ప్రపంచంలో ఈ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరుగుతున్నదని,అందులో భాగంగానే నేడు వేడుకలు నిర్వహించడం జరుగుతున్నదని అన్నారు.మహిళలు ఆధ్యాత్మికంగా,ధార్మికంగా పురోగతి సాధించాలని,తమ సంతతిని ఉత్తమ మార్గంలో నడిపించాలని అన్నారు.తల్లి పాదాల క్రింద స్వర్గం ఉన్నదని మహా ప్రవక్త హజ్రత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం బోధించారని,సమాజ సంస్కరణ మహిళలతోనే సాధ్యమని అన్నారు.ఈ కార్యక్రమంలో నూర్జహాన్ యూసుఫ్,నజీమా రఫీ,నస్రీన్ యాకూబి సలీం,తలాత్ సలీం,ఆలియా సలీం ఆసిఫా సలీం,రుబీనా,రేహానా,సమ్రీన్,అహ్మదీయ ముస్లిం జమాత్ మహిళలు తదితరులు పాల్గొన్నారు.