కమ్మ సేవా సమితి నూతన సంవత్సర క్యాలండర్ ఆవిష్కరణ
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని రాసోయి హోటల్లో కమ్మ సేవా సమితి షాద్‌నగర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో 2026 నూతన సంవత్సర క్యాలండర్‌ను ఘనంగా ఆవిష్కరించారు.ఈ కార్యక్రమంలో కమ్మవారి సేవా సంఘాల సమాఖ్య రాష్ట్ర గౌరవ అధ్యక్షులు,సీవీఆర్ న్యూస్ అధినేత చలసాని వెంకటేశ్వర రావు,పీఏసీ ఛైర్మన్, రాష్ట్ర అధ్యక్షులు ఆరేకపూడి గాంధీ క్యాలండర్‌ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆరేకపూడి గాంధీ మాట్లాడుతూ,షాద్‌నగర్ కమ్మ సేవా సమితి ఏర్పాటైన నాటి నుంచి గత పది సంవత్సరాలుగా నిర్వహిస్తున్న వనభోజనాలు,క్యాలండర్ ఆవిష్కరణ కార్యక్రమాల్లో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు.రానున్న 2026 సంవత్సరంలో నూతన దిశ, కొత్త విధానాలతో ముందుకు సాగుతామని ప్రకటించారు.గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన ఐదు ఎకరాల భూమికి సంబంధించిన న్యాయపరమైన సమస్యలను పరిష్కరించుకుని,దాతల సహకారంతో అక్కడ భారీ నిర్మాణాలు చేపడతామని తెలిపారు.ఆ నిర్మాణాల ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు,అవసరమైన బంధువుల సంక్షేమానికి వినియోగించే కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.సంస్థ చేపడుతున్న కార్యక్రమాలపై విమర్శలు చేసే వారు చేస్తూనే ఉంటారని,వాటిని పట్టించుకోకుండా సేవా కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని సూచించారు.కమ్మ కుటుంబ సభ్యులకు ఎలాంటి సమస్యలు వచ్చినా తాను ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో చలసాని వెంకటేశ్వర రావు,ఆరేకపూడి గాంధీతో పాటు కోశాధికారి నాగభూషణం,హైదరనగర్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు,షాద్‌నగర్ కమ్మ సేవా సమితి అధ్యక్షులు పాతూరి వెంకటరావు,కార్యదర్శి పినపా ప్రభాకర్,కోశాధికారి వట్టికొండ ఏరయ్య,సలహాదారులు గుదే వసంతరావు,బదారుపల్లి నాగేశ్వరరావు,మక్కపాటి మల్లేశ్వరరావు,కొర్రపాటి శ్రీనివాస రావు,మండవ మురళీధర రావు,నాయకులు రామసుబ్బారావు,హరికృష్ణ,పీఠం అనిల్,కట్టా హరి తదితర కమిటీ సభ్యులు పాల్గొన్నారు.