ఈ రోజు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేసి డి ఎం హెచ్‌వో ఆఫీస్ సూపర్డెంట్ రాజలింగం గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా చంద్రశేఖర్ citu జిల్లా కన్వీనర్ మాట్లాడుతూ యూపీ హెచ్‌సి అండ్ (PHC) కేటగిరీలో పనిచేస్తున్న . కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఏఎన్ఎం లందరిని పర్మెంట్ చేయాలి అలాగే ఉద్యోగ భద్రత కల్పించాలి అధిక పని దారం తగ్గించాలి. వీరితో చేపిస్తున్న వెట్టి చాకిరి మాన్పించాలి రెండవ దశ కంటి వెలుగులో అయినా ప్రభుత్వం తీసుకొచ్చిన ఏ సంక్షేమ పథకాలైన వీరితో చేయించరాదు దీనికి సంబంధించిన ఒకరిని ప్రత్యేకంగా కేటాయించి డాటా ఎంట్రీ చేయించాలి. ఇలా ప్రతి కార్యక్రమానికి 32 రిజిస్టర్లు రాయవాల్సి వస్తుంది అలా చేయడం వలన పనిబారానికి ఒత్తిడికి గురవుతున్నారు. ఏఎన్ఎంలకు అదనపు ఇంటి భత్యం పునరుద్ధరించండి సొంత వాహనాలపై మరుమూల ప్రాంతంలో ఆరోజు ఆరోగ్య సేవలు అందిస్తున్న ఏఎన్ఎం (anm)లకు వాహన మరియు పెట్రోల్ అలవెన్స్ మంజూరు చేయాలి. తదితర న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కే రాజనర్సు సి ఐ టి యు జిల్లా నాయకులు.ANM జిల్లా నాయకులు లక్ష్మి, దీవెన , కవిత , డి లక్ష్మి , జి రేణుక , రాజనీత , కే రేణుక తదితరులు పాల్గొన్నారు