గొర్లు చనిపోయిన నష్ట కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి .
Hanamkondaపశువు సంవర్థక శాఖ మంత్రి _శ్రీనివాస్ యాదవ్ కు మరియు రాష్ట్ర చైర్మన్ దూదిమెట్లబాలరాజుకు వినతిపత్రం .
ఎల్కతుర్తి మండలం దండేపల్లి గ్రామానికి చెందిన మాదం బిక్షపతి గొర్రెలుచనిపోయి నష్టపోయిన కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ ఈరోజు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు గొర్రెలు మేకల పెంపకం దారుల అభివృద్ధి సంస్థ చైర్మన్ దూదిమెట్ల బాలరాజును గొర్రెలు మేకల పెంపకం దారుల సంఘం హనుమకొండ జిల్లా కార్యదర్శి రాష్ట్ర ఉపాధ్యక్షులు కాడబోయిన లింగయ్య. జిల్లా అధ్యక్షులు శాతబోయిన రమేష్ జిల్లా ఉపాధ్యక్షులు గంటేసమ్మయ్య వేల్పుల రమేష్ యాదవ్గార్లు మంత్రి నివాసంలో. రాష్ట్ర చైర్మన్ ఛాంబర్ లో కలిసి వినతి పత్రం అందించారు. ఆదుకోవాలని కోరారు ఈ సందర్భంగా గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం *జిల్లా ప్రధాన కార్యదర్శి జిల్లా. రాష్ట్ర *ఉపాధ్యక్షులు కాడబోయిన లింగయ్య ప్రభుత్వాన్ని కోరారు*
- అనంతరం మాట్లాడుతూ ఈనెల 11న* ఉదయం రోజువారీగా గొర్రెలను మేపుకోవడం కోసం గొర్రెలను తీసుకొని వెళ్లారు గొర్రెలు మేపుతున్న సమయంలో కాజీపేట నుండి బల్లర్ష వైపు వెళ్తున్న దానాపూర్ ఎక్స్ప్రెస్. హారన్ కొట్టడంతో గొర్రెలు చెల్లా చెదరై రైలు కిందపడి 65 గొర్రెలు చనిపోయి ఆ కుటుంబం రోడ్డును పడ్డ పరిస్థితి ఏర్పడిందని లింగయ్య అన్నారు.
మాదం బిక్షపతి కుటుంబం గొర్రెల మేకల వృత్తిపై ఆధారపడి తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు గొర్లు రైలు ఢీకొని చనిపోవడంతో 6.లక్షల 50 వేల రూపాయలు తీవ్ర నష్టం జరిగిందని అన్నారు రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ చేసిన గొర్రెలతో పాటు అతను అప్పు తీసుకొచ్చి 21 గొర్రెలకు తోపాటు మిగతా గొర్రెలను కొనుక్కొని తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు ప్రమాదవశాత్తు రైలు ఢీకొని గొర్లు చనిపోవడంతో ఆ కుటుంబం తీవ్ర ఇబ్బందిలో పడిందని ఆ కుటుంబానికి ప్రభుత్వం సహాయం చేసి ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. వెంటనే వీరు స్పందిస్తూ గొర్రెలు మేకల పెంపకం దార్ల ఎండి గారికి వినతిపత్రం రిఫర్ చేసి ఎల్లాంటి అవకాశాలు ఉన్న మీ కుటుంబాన్ని కాపాడాలని అన్నారు. జిల్లా కలెక్టర్ తో సంప్రదించి ఆ కుటుంబానికి న్యాయం చేస్తామని బాలరాజు అన్నారు జాయింట్ డైరెక్టర్ కెవి నారాయణ గారిని ద్వారా సంప్రదించారు. దీనికి సంబంధించిన రిపోర్టును ప్రభుత్వాన్ని పంపించాలని అన్నారు .