నాటి మహనీయుల స్ఫూర్తితో నేటి యువత ఉద్యమించాలి ÷ డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్…..
Khammamఖమ్మం రూరల్ జనవరి23,2023
సమాజం మార్పుకు కృషి చేసిన మహనీయులను నేటి యువత మర్చిపోవదని, వారి పోరాట స్ఫూర్తితో నేడు సమస్యలపై ఉద్యమించాలని డివైఎఫ్ఐ ఖమ్మం జిల్లా కార్యదర్శి బషీరుద్దీన్ యువతకు పిలుపునిచ్చారు...
స్థానిక వరంగల్ క్రాస్ రోడ్ లోని తమ్మినేని సుబ్బయ్య భవన్లో రూరల్ మండల కమిటీ ఆధ్వర్యంలో డివైఎఫ్ఐ 2023 క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ మండల కార్యదర్శి పొన్నం మురళి అధ్యక్షుత న జరిగిన సభలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న నండ్ర ప్రసాద్, షేక్ బషీరుద్దీన్ లు మాట్లాడుతూ ఎందరో మహనీయులు ఈ దేశం కోసం సమాజం కోసం అనేక త్యాగాలు చేయటం ద్వారా ఈరోజు మనం స్వేచ్ఛా స్వతంత్రాలతో జీవిస్తున్నామని ఇలాంటి మహనీయుల జీవిత గాథలు యువత తెలుసుకోవాలని , వాటిని ఆచరణలో పెట్టాలని అప్పుడే భవిష్యత్తు తరాలకు మనం మంచి సమాజాన్ని అందించగలమని వారు అన్నారు. డివైఎఫ్ఐ గత తొమ్మిది సంవత్సరాలుగా మహనీయులు, స్వతంత్ర సమరయోధులు, విప్లవకారులు, సంఘ సంస్కర్తలు, కవులు,కళాకారులు, క్రీడాకారులు, మేధావుల చిత్రపటాలతోని క్యాలండర్ వేయడం జరుగుతుందని ఈ క్యాలెండర్ కు అద్భుతమైన ఆదరణ ఉందని వారి సందర్భంగా అన్నారు. ఈ క్యాలెండర్ యాడ్స్ ఇచ్చి ప్రోత్సహిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ సభలో వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు నండ్ర ప్రసాద్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.
ఈ క్యాలెండర్ ఆవిష్కరణ సభలో డివైఎఫ్ఐ ఖమ్మం రూరల్ అధ్యక్షులు, జక్కంపూడి కృష్ణ, మండల కమిటీ సభ్యులు ఊరడి విజయ్, అనీష్, సిద్దు, తాటి వెంకటేశ్వర్లు, తోట నరేష్ రెడ్డి, వ* కోటి నరేష్, చాంద్ పాషా, శభాష్ రెడ్డి నాయకులు గురవయ్య భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు.....