ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ, అరటిపండ్లు, కూల్ డ్రింక్స్ పంపిణీ చేసిన తాటి
కూలీలకు అండగా నిలిచిన తాటి వెంకటేశ్వర్లు
ఉపాధి కూలీలకు రూ.500 వేతనం ఇవ్వాలని ప్రభుత్వానికి డిమాండ్ పాతూరు, గుర్రాలగుంట గ్రామాల్లో ఉపాధి హామీ పనులు నిర్వహిస్తున్న కూలీలకు బూర్గంపహాడ్, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర మాజీ తొలి ట్రైకార్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు తాటి వెంకటేశ్వర్లు మజ్జిగ ప్యాకెట్లు, అరటిపండ్లు, కూల్డ్రింక్స్ పంపిణీ చేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా కూలీలకు ఉపశమనం కలిగించేందుకు స్వయంగా వాటిని అందజేసి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు.
కూలీలతో మాట్లాడిన తాటి వెంకటేశ్వర్లు ఉపాధి పనుల నిర్వహణ, వేతనాల చెల్లింపులు, పని దినాలపై ఆరా తీశారు. అలాగే గ్రామ సమస్యలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
“ఎండాకాలంలో ఉపాధి కూలీలు పడుతున్న కష్టం చూస్తుంటే బాధగా ఉంది. వారి మెడికల్ కిట్ మరియు టెంట్ లను ఎర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేశాం. ప్రస్తుతం కూలీలకు సరిపడా పని దినాలు, తగిన వేతనాలు అందడం లేదు. ఉపాధి హామీ కూలీలకు రోజుకు కనీసం రూ.500 వేతనం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను” అని అన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ భూక్యా ధర్మ, మాజీ సర్పంచ్ బైటి రాజేష్, పెద్దరాపు నాగరాజు, తాటి రవి, సోయం చిన్నారి ఊకే అశోక్, సోడే శ్రీనివాస్, బొర్రా సుధాకర్ భూక్యా నందా. అంగోత్ భద్రు భూక్యా రవి అజి్మీరా నాగరాజు. తెల్లం నరసింహారావు. భూక్యా ధర్మ. సడియం అశోక్. సోడే సింగయ్య. అంగోత్ జోహాలాలు. అంగోత్ పెద్ద భద్రు. తాటి సాగర్.తేజవత్ సూర్యం భూక్యా వీరభద్రం. ఇర్ప నాగ సిధార్ధ. తాటి రామకృష్ణ. పర్సక ప్రసాద్. గుగులోత్ యాకు. వంకుడోత్ శివ. భూక్యా నాగరాజుభూక్యా చిన్న భద్రు మరియు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు