మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కార్యాలయం
తిరుపతి జిల్లా నాయుడుపేటలోని సూళ్ళూరుపేట నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కార్యాలయంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి ముఖ్యఅతిథిగా హాజరై మీడియా సమావేశంలో ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటర్ల జాబితా అత్యంత కీలకమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. సవరణ ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా, పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండి పర్యవేక్షించాలని సూచించారు.
అనంతరం కిలివేటి సంజీవయ్య కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, నియోజకవర్గ వ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు పని చేయాలని దిశానిర్దేశం చేశారు. అధికారులు మరియు పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేస్తూ, ఎక్కడా ఎటువంటి లోపాలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని స్పష్టం చేశారు. ఇంటింటికీ వెళ్లి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా అవగాహన కల్పించాలని ఆయన కార్యకర్తలకు సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తంబిరెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కామిరెడ్డి రాజారెడ్డి, నాయుడుపేట పట్టణ పార్టీ అధ్యక్షుడు కలికి మాధవ రెడ్డి, నాయుడుపేట మండల పార్టీ అధ్యక్షుడు ఒట్టూరు కిషోర్ యాదవ్, ఓజిలి మండల పార్టీ అధ్యక్షుడు పాదర్తి హరినాథ్ రెడ్డి, పెళ్లకూరు ఎంపీపీ శేఖర్ రెడ్డి, వైఎస్ఆర్సిపి మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కురుగొండ్ల ధనలక్ష్మి, దొరవారిసత్రం మండల పార్టీ సీనియర్ నాయకులు వేణుంబాక మునిస్వామి నాయుడు, దొరవారిసత్రం మండల పార్టీ అధ్యక్షుడు అల్లూరు రాహుల్ రెడ్డి, వైయస్సార్సీపీ న్యాయవిభాగం సూళ్లూరుపేట నియోజకవర్గ అధ్యక్షులు చదలవాడ కుమార్, తదితరులు పాల్గొన్నారు. ఈ సమీక్ష సమావేశం ద్వారా ఓటర్ల నమోదు ప్రక్రియలో వేగం పెంచాలని పార్టీ శ్రేణులు నిర్ణయించాయి.