రాంపురం ప్రాథమిక పాఠశాలకు ప్రభుత్వం మూడు కంప్యూటర్లను ఏర్పాటు
తెలుగు గళం న్యూస్ మహబూబాబాద్ జిల్లా.
రాంపురం ప్రాథమిక పాఠశాలలో మూడవ ,నాలుగవ, ఐదవ తరగతుల విద్యార్థులకు ఎక్సల్ అసిస్టెడ్ లాంగ్వేజ్ లెర్నింగ్ మరియు అసిస్టెడ్ మాథ్స్ లెర్నింగ్ బోధన చేయుటకు రాంపురం ప్రాథమిక పాఠశాలకు ప్రభుత్వం మూడు కంప్యూటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. దీనిద్వారా విద్యార్థులకు సులభతరంగా అర్ధమయ్యే విధంగా గణితం ,తెలుగు ,ఇంగ్లీష్ విషయాలను బోధించవచ్చని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుగులోతు హీరాలాల్ తెలియజేయడం జరిగింది. ఉపాధ్యాయులు గుర్రం వెంకన్న గౌడ్,కనకం గణేష్ ,దాసరి శ్రీధర్ విద్యార్థుల తల్లిదండ్రులు బందు పరశురాములు తదితరులు పాల్గొన్నారు