ఏప్రిల్ 5న చలో ఢిల్లీ జయప్రదం చేయండి
Jangaon
కేంద్ర ప్రభుత్వ రైతు కార్మిక వ్యవసాయ కూలీల వ్యతిరేక విధానాలను నిరసిస్తూ జిల్లా సదస్సు
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పి జంగారెడ్డి
జనగామ:కేంద్ర బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు కార్మిక కూలీల ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఏప్రిల్ 5వ తేదీన దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం ఉంటుందని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని రైతులు కార్మికులు వ్యవసాయ కూలీలు పెద్ద ఎత్తున తరలిరావాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పీజంగారెడ్డి పిలుపునిచ్చారు
ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలోని విజయ ఫంక్షన్ హాల్ లో సిఐటియుతెలంగాణ రైతు సంఘం తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను* నిరసిస్తూ జిల్లా సదస్సు సిఐటియు జిల్లా అధ్యక్షులు బొట్ల శ్రీనివాస్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సింగారపు రమేష్ తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు రాపర్తి సోమయ్య అధ్యక్షతన జరిగింది
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పీ జంగారెడ్డి మాట్లాడుతూ……
కేంద్ర ప్రభుత్వం రైతాంగానికి రాతపూర్వకంగా ఇచ్చిన హామిని తుంగలో తొక్కింది. కనీస మద్దతు ధరల చట్టం చేస్తానని అమలు చేయలేదు. రైతుల ఆత్మహత్యల పరంపర ఆపడానికి ఈ బడ్జెట్లో ఏరకమైన కేటాయింపులు చేయలేదు.పైగా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సిసిఐ)కు కేటాయించాల్సిన నిధులను పూర్తిగా తగ్గించి వేశారు. పత్తి కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవడంలేదు. ఫలితంగా మధ్య దళారీలు రైతుల నుండి కనీస మద్దతు ధర కంటే తక్కువకు కొనుగోలు చేస్తున్నారు. ఎరువుల సబ్సీడిని కుదించడం వల్ల రైతాంగానికి, ఆహార భద్రతకు తీవ్ర ముప్పు వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాలలో పేదలకు ఉపాధిని చూపిస్తున్న గ్రామీణ ఉపాధి హామీ పధకానికి నిధులు కోత పెట్టిందని అన్నారు. కనీస 100 రోజులు పని కల్పించాలంటే 2 లక్షల 25 వేల కోట్లు అవసరమవుతుంది. కానీ కేంద్ర ప్రభుత్వం గత సంవత్సరం కంటే నిధులు తగ్గించినదని అన్నారు. బ్రిటిష్ కాలం నుండి కార్మికులు పోరాడి సాధించుకున్న 27 కార్మిక చట్టాలను రద్దుచేసి పనిగంటల విధానాన్ని పెంచి కార్మికులు యూనియన్ పెట్టుకునే అవకాశాన్ని లేకుంటే చేసి నాలుగు లేబర్ కోట్లను తెచ్చి కార్మికుల నడ్డి వీరుస్తున్నారని సుప్రీంకోర్టు చెప్పిన విధంగా కనీస వేతనం 26వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసనగా ఏప్రిల్ 5న లక్షలాది మందితో దేశ రాజధాని ఢిల్లీ కార్మిక కర్షక బహిరంగ సభ ఉంటుందని కేంద్ర ప్రభుత్వ విధానాలపై కార్యాచరణ ప్రకటించారు. మార్చి 17 మండల సదస్సులు జరపాలని,జిల్లాలోని అన్ని గ్రామాల్లో పెద్ద ఎత్తున కరపత్రాలు, పోస్టర్లు ,కార్నర్ మీటింగ్స్, పాదయాత్రలు నిర్వహించి మార్చి 24,25తేదీలలో జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచార జీపు జాత ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వారు తెలిపారు
ఈసదస్సులో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మోకు కనకా రెడ్డి తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఏదునూరి వెంకట్రాజం సిఐటి జిల్లా ప్రధాన కార్యదర్శి రాపర్తి రాజు తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి భూక్య చందు నాయక్ సిఐటియు జిల్లా కోశాధికారి చుంచు విజేందర్ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు ఇర్రి అహల్య సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి చిట్యాల సోమన్న సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు అన్నబోయిన రాజు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి పోతుకనూరి ఉపేందర్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సహాయ కార్యదర్శి గంగాపురం మహేందర్ తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి రామావత్ మీట్యా నాయక్ సిఐటియు నాయకులు జోగు ప్రకాష్ తాండ్ర ఆనందం కచ్చ గళ్ళ వెంకటేష్ రైతు సంఘం నాయకులు ఉరుసు కుమార్ సమ్మయ్య కరుణాకర్ వీరితోపాటు పెద్ద ఎత్తున రైతులు కార్మికులు వ్యవసాయ కూలీలు పాల్గొన్నారు