ఆధాని నష్టాన్ని పూడ్చడం కోసమే గ్యాస్ ధర పెంపున మోడీ ప్రభుత్వం: సీపీఎం
Uncategorizedఆధాని కి వచ్చిన నష్టాన్ని పూడ్చడం కోసంమే మోడీ ప్రభుత్వం గ్యాస్ ధరలు పెంచిందని సీపీఎం హన్మకొండ సౌత్ మండల కమిటీ సభ్యులు నోముల కిషోర్ అన్నారు. గురువారం అదాలత్ సెంటర్ లో సీపీఎం ఆధ్వర్యంలో కంచర్ల కుమరస్వామి అధ్యక్షతన నిరసన కార్యక్రమాన్ని చేశారు. ఈ మేరకు వారు మాట్లాడుతూ సామాన్యులకు కేంద్ర ప్రభుత్వం మరొకసారి షాక్ ఇచ్చిందని, గృహ వినియోగ గ్యాస్ తో పాటు కమర్షియల్ గ్యాస్ ధరలను చమురు కంపెనీలు భారీగా పెంచాయన్నారు. ఇప్పటికే పెరిగిన ధరలకు సామాన్యులు విలవిలలాడుతుండగా తాజాగా పెరిగిన ధరలతో మరింత భారం పడుతుందని అన్నారు.
పదేళ్ల క్రితం రూ.400 ఉన్న గ్యాస్ బండ ధర ఈ పది ఏళ్లలో 1150 రూపాయలకు పెంచిన ఘనత మోడీకే చెందిందని వారు పేర్కొన్నారు. మోడీ ప్రభుత్వం పేదలు మధ్యతరగతి ప్రజానీకంపై పెను భారాలు మోపుతూ పాలన సాగిస్తున్నది. విమాన యందన ధరలు తగ్గించింది కార్పొరేట్లకు ఆస్తులను ఆదాయాలను ఇస్తున్నది. పన్ను రాయితీలు ఇచ్చి వారి ఆదాయాలను పెంచుతున్నది. ఇప్పటికే నిత్యవసర సరుకులు ధరలు పెట్రోలు డీజిల్ ఎరువులు పురుగు మందులు రైల్వే రవాణా చార్జీలను పెంచి ప్రజలపై పెనుబారాలు మోపింది. కావున మోడీ దుర్మార్గాన్ని ప్రజలంతా కూడా వ్యతిరేకించాలని ధర తగ్గింపుకే ప్రజా ఉద్యమాలను చేపట్టాలని అందరూ ఉద్యమాల్లో పాల్గొని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు అలకుంట్ల యకయ్య, మల్లయ్య, శివరాత్రి రాజు, కార్తిక్, నరేష్, రంజిత్, స్రావన్, నవ్య, స్రవంతి, శారదా, తదితరులు పాల్గొన్నారు